ఈ జిల్లాల్లో వడగాల్పులు..  

షేర్ చేయండి:
ఈ జిల్లాల్లో వడగాల్పులు..  

సాక్షి లైఫ్ : వేసవి తాపం మరింత ఉధృతంగా ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) నివేదికల ప్రకారం, ఆదివారం అనేక ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా నమోదయ్యాయి. సూర్యాపేటలోని పెన్‌పహాడ్, నల్గొండలోని నాంపల్లె, భద్రాద్రి కొత్తగూడెంలోని గరిమెళ్లపాడులో 44.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీస్తున్నాయి.

 ఇది కూడా చదవండి.. ఐస్ బాత్ తో అద్భుతమైన ప్రయోజనాలు 

ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో నీళ్లు ఎక్కువగా తాగుతూఉండాలని, ఎండలు ఎక్కువగా ఉండే సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమయితే తప్ప బయటకు రావొద్దని, వేసవి తాపాన్ని అధిగమించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ విభాగం (ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్ మెంట్) అధికారులు ప్రజలకు సూచించారు.

టిఎస్‌డిపిఎస్ కార్యాలయం అందించిన నివేదిక ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, జోగులాంబ గద్వాల, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీస్తున్నాయి. 

 ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..    

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.