ఐస్ బాత్ తో అద్భుతమైన ప్రయోజనాలు 

షేర్ చేయండి:
ఐస్ బాత్ తో అద్భుతమైన ప్రయోజనాలు 

సాక్షి లైఫ్ : ఈ రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు ఐస్ బాత్ చేస్తున్నారు. గత కొంత కాలంగా సెలబ్రిటీలు, సామాన్యుల్లోనూ దీనికి క్రేజ్ వేగంగా పెరిగింది. ఐస్ బాత్ ను క్రయోథెరపీ అని కూడా అంటారు. ఐస్ బాత్ చేయడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అంతే కాదు చర్మానికి, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు ఎంతో చేస్తుంది. ఐస్ బాత్  అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం.


 ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? 

ఐస్ బాత్ ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తుంది, ఈ 6 కారణాల వల్ల సెలబ్రిటీలు కూడా ఈ ఐస్ థెరపీ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా ట్రెండ్స్ తరచుగా పుట్టుకొస్తూ ఉంటాయి. ఆహారం నుంచి ఆరోగ్యం వరకు, ప్రతిరోజూ ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. అటువంటి ట్రెండ్‌లలో ఐస్ బాత్ ఒకటి. ఇది ప్రతిరోజూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంటుంది. 
 
ప్రస్తుతం ఐస్ బాత్ చేయడం లేదా చల్లటి నీటిలో స్నానం చేయడం అనేది సెలబ్రిటీలు ,సామాన్యులకు సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఐస్ బాత్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చొ తెలుసుకుందాం.. 

ఐస్ బాత్ అంటే ఏమిటి..?

ఐస్ బాత్ ను కూలింగ్ వాటర్ ఇమ్మర్షన్ లేదా క్రయోథెరపీ అని పిలుస్తారు, ఒక వ్యక్తిని 11 నుంచి 15 నిమిషాల పాటు నీటిలో ఉంచుతారు. ఈ నీరు 50-59 °F (10- 15 °C) మధ్య ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీలు దాని ప్రయోజనాలు పొండుతున్నారు.

కండరాల రికవరీ వేగవంతం.. 

ఐస్ బాత్ కండరాల రికవరీని వేగవంతం చేస్తుంది. నొప్పులను తగ్గిస్తుంది.

వాపును తగ్గిస్తాయి.. 

భారీ వ్యాయామం లేదా వ్యాయామం తర్వాత, ఐస్ బాత్ తీసుకోవడం వల్ల వాపు ,కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది ఐస్ బాత్.

రక్త ప్రసరణ.. 

 ఐస్ బాత్ చేయడం ద్వారా, దాని చల్లదనం రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఇది కండరాలకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్ పంపిణీని పెంచుతుంది.

మానసిక ఆరోగ్యానికి మేలు.. 

ఐస్ బాత్‌లు మెరుగైన మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. విశ్రాంతి లభిస్తుంది. తద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.

రోగనిరోధక వ్యవస్థను బలోపేతం..

ఐస్ వాటర్ తో స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మంచు స్నానాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, వ్యాధులు ,ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

చర్మానికి ప్రయోజనకరం.. 

ఆరోగ్యంతో పాటు, ఐస్ బాత్ చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. చల్లదనం చర్మ సమస్యలను తగ్గించడంతోపాటు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

 ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..    

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.