హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతితో టీనేజ్ పాకిస్తాన్ టెన్నిస్ ప్లేయర్ మృతి..
సాక్షి లైఫ్ : అతి చిన్న వయసులో పాకిస్తానీ టెన్నిస్ ప్లేయర్ హైపర్‌ట్రోఫిక్ కార్డియో మయోపతి కారణంగా గుండెపోటుతో చనిపోయింది. పాకిస్తాన్ కు చెందిన 17 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్ జైనాబ్ అలీ నఖ్వీ ప్రాక్టీస్ సెషన్ తర్వాత ఆమె బాత్రూంలో కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె చనిపోయింది. ఆమె అతి చిన్నవయసులో హైపర్ట్రోఫిక్ కార్డియో మయోపతితో మరణించడం చాలా బాధాకరమైన విషయం.
ముప్పై, నలభై , యాభైలలో గుండెపోటు చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ గుండెపోటు కారణంగా ఎంతోమంది ప్రముఖ నటులు ప్రాణాలు వదిలారు. అలాంటి వారిలో కర్ణాటక సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి, చిరంజీవి సర్జా,నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ,ప్రముఖ గాయకుడు కెకె గా ప్రసిద్ధి చెందిన కృష్ణకుమార్ కున్నాత్, తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి తారకరత్న వంటి నటులు గుండె పోటుతోనే చనిపోయారు.
ప్రముఖ హాస్యనటుడు, సునీల్ గ్రోవర్ 2022లో గుండెపోటుతో బాధపడ్డాడు. ఆయననాలుగు బైపాస్ సర్జరీలు చేయించుకున్న ఆయన వయస్సు కేవలం 45 ఏళ్లు. ఆతర్వాత ఆయన ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందారు. ఏడు రోజుల శస్త్రచికిత్స తర్వాత, సునీల్ గ్రోవర్ డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు.
పురుషులే కాదు మహిళలు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితా సేన్, కేవలం 47 సంవత్సరాల వయస్సులో, ఫిబ్రవరి 2023లో గుండెపోటు వచ్చింది. తాను యాంజియోప్లాస్టీ ప్రక్రియ చేయించుకున్నానని, ఎలాంటి సమస్య లేకుండా గుండెలో స్టెంట్‌ను అమర్చినట్లు సుస్మిత అప్పట్లో సామజిక మాధ్యమం ద్వారా వెల్లడించింది. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి.. బుబోనిక్ ప్లేగు వ్యాధికి కారణాలేంటి..? నివారణ ఎలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
