బుబోనిక్ ప్లేగు వ్యాధికి కారణాలేంటి..? నివారణ ఎలా..?
సాక్షి లైఫ్ : అమెరికాలో బుబోనిక్ ప్లేగు వ్యాధి మొదటి కేసు నమోదైంది. ఇది తీవ్రమైన అంటువ్యాధి, దీనిని (బ్లాక్ డెత్) అని కూడా అంటారు. ఎలుకలకు సోకిన పేల ద్వారా మానవులకు వ్యాపించే తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అసలు ఈ వ్యాధి ఏమిటో, దాని లక్షణాలు,దానిని నివారించే మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బుబోనిక్ ప్లేగు వ్యాధి అంటే..?
ఈ వ్యాధి యునైటెడ్ స్టేట్స్‌లోని ఒరెగాన్ రాష్ట్రంలో 2015 తర్వాత తొలిసారిగా ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు వ్యాధి వచ్చింది. బుబోనిక్ ప్లేగు వ్యాధి అనేది ఎలుకలను తినే పిల్లుల ద్వారా ఎక్కువగా మానవులకు వ్యాపించే తీవ్రమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్. అంతేకాదు ఈ వ్యాధి సోకిన జంతువులను తాకినా మనుషులకు ఈ బుబోనిక్ ప్లేగు వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఈ వ్యాధి కారణంగా..
ఈ వ్యాధి కారణంగా మధ్య యుగాలలో మిలియన్ల మంది యూరోపియన్లు చనిపోయారు. యెర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల బుబోనిక్ ప్లేగు వ్యాధి వస్తుంది. ఇది సోకిన ఈగలు లేదా పేల ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఎలుకలు లేదా ఉడుతలు వంటి వాటిని కుట్టినా వ్యాధి ఎక్కువమందికి వచ్చే ప్రమాదం ఉంది.
బుబోనిక్ ప్లేగు అనేది ఒక రకమైన ప్లేగు వ్యాధి. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, వ్యాధి వల్ల కలిగే శోషరస కణుపుల వాపు (బుబోలు) నుంచి దీనికి పేరు వచ్చింది. చంకలు, నడుము, మెడలో గుడ్డు పరిమాణంలో గడ్డలు వచ్చి వాటి నుంచి చీము వస్తుంది.
బుబోనిక్ ప్లేగు వ్యాధి లక్షణాలు..?
తలనొప్పి
చలిగా అనిపించడం
సడెన్ గా తీవ్ర జ్వరం
కడుపు, చేతులు, కాళ్లు నొప్పి
శోషరస కణుపులలో వాపు (బుబోలు) లేదా గడ్డలు, చీము రావడం.
బుబోనిక్ ప్లేగు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది..?
బుబోనిక్ ప్లేగు వ్యాధి అనేది బ్యాక్టీరియా యెర్సినియా పెస్టిస్ (వై.పెస్టిస్) వల్ల కలిగే ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది ఒక రకమైన జూనోటిక్ వ్యాధి. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, ముఖ్యంగా ప్లేగు వ్యాధికి గురయ్యే ఎలుకలను తినడం ద్వారా పిల్లులు,ఇతర జంతువులు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది. అయితే, ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించే అవకాశం ఉండదు.
ఇది కూడా చదవండి.. అమెరికాలో బుబోనిక్ ప్లేగు వ్యాధి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
