మంచూరియా, పీచు మిఠాయిల అమ్మకాలను నిషేధించిన రాష్ట్రం ఏది..?  

షేర్ చేయండి:
మంచూరియా, పీచు మిఠాయిల అమ్మకాలను నిషేధించిన రాష్ట్రం ఏది..?  

సాక్షిలైఫ్ : ప్రజల నుంచి మీడియా నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మంచూరియా, పీచు మిఠాయిలో ఉన్న కృత్రిమ రంగుల నమూనాలను రాష్ట్రవ్యాప్తంగా సేకరించి ప్రయోగశాలలలో పరీక్షించారు. 171 మంచూరియా శాంపిళ్లను సేకరించగా, అందులో 107 శాంపిల్స్‌లో అసురక్షిత కృత్రిమ రంగులున్నట్లు వెల్లడైంది. మొత్తం25 పీచు మిఠాయి నమూనాలలో 15 సురక్షితంగా లేవని తేలింది. వీటిలో టార్ట్రాజైన్, కార్మోయిసిన్, రోడమైన్ బి వంటి  రసాయనాలున్నాయని ఫలితాల్లో తేలింది.  

ఆహారంలో కృత్రిమ రంగులను ఎక్కువగా వాడడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని అక్కడి ప్రభుత్వంజారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజలు ఆహారంలో కృత్రిమ రంగులు వాడవద్దని, అస్సలు వాటిని ఉపయోగించవద్దని సూచించింది. ఎలాంటి కలర్స్ లేకుండా తయారుచేసిన మంచూరియా అమ్మకాలు జరపవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

 మంచూరియా,పీచు మిఠాయిల అమ్మకాలను నిషేధించిన రాష్ట్రం ఏది..?  


ఏ) గోవా, బి) మధ్యప్రదేశ్, సి) తమిళనాడు, డి) కర్ణాటక

ఆన్సర్ : కర్ణాటక


కాలీఫ్లవర్ (గోబీ)మంచూరియా, (కాటన్ క్యాండీ)పీచు మిఠాయిల అమ్మకాలను నిషేధించింది కర్ణాటక. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆహార భద్రత ,నాణ్యత విభాగం  'కాలీఫ్లవర్ మంచూరియా, పీచు మిఠాయిల నమూనాలను ప్రయోగశాలలలో పరీక్షించింది. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా 'కాలీ ఫ్లవర్ మంచూరియా' తయారీలో ఎలాంటి కృత్రిమ రంగులు వినియోగించవద్దని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశించారు.
 
పీచు మిఠాయి, మంచూరియా తయారీలో వాడే ఆర్టిఫీషియల్ కలర్స్ ను కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు పీచు మిఠాయి, మంచూరియా విక్రయాలను కూడా నిషేధించినట్లు కర్ణాటక వైద్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు.

ఇది కూడా చదవండి.. బ్లూ టీ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.