Air Purifiers : కాలుష్య కోరల నుంచి ఎయిర్ ప్యూరిఫైయర్లు రక్షిస్తాయా..? కొనే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
సాక్షిలైఫ్ : చలికాలం వస్తోందంటే చాలు.. దేశంలోని పలు నగరాల్లో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. గాలి నాణ్యత పడిపోవడంతో ఇంట్లో, ఆఫీసుల్లో స్వచ్ఛమైన గాలి కోసం చాలామంది ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేస్తున్నారు. దుమ్ము, పొగ, అలెర్జీ కారకాలను ఇవి తొలగిస్తాయని సంస్థలు చెబుతుంటాయి. అయితే ఇవి నిజంగానే విషపూరితమైన గాలి నుంచి మనల్ని కాపాడతాయా..? శ్వాసకోశ వ్యాధుల ముప్పును తగ్గిస్తాయా..? మీరు కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ కొనే ఆలోచనలో ఉన్నట్లయితే, ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఎయిర్ ప్యూరిఫైయర్ ఎలా పనిచేస్తుంది..?
ఈ యంత్రం గదిలోని గాలిని తనలోకి లాక్కుని, అందులోని కాలుష్య కణాలను ఫిల్టర్ల సాయంతో తొలగిస్తుంది. ఆ తర్వాత శుభ్రమైన గాలిని తిరిగి గదిలోకి వదులుతుంది. నాణ్యమైన ప్యూరిఫైయర్లు ఈ కింది వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటాయి.
PM2.5, PM10 లాంటి అత్యంత సూక్ష్మ కణాలు
దుమ్ము, ధూళి కణాలు..
పొగ, పుప్పొడి (Pollen) కణాలు..
పెంపుడు జంతువుల నుంచి వెలువడే అలెర్జీ కారకాలు..
హెపా (HEPA) ఫిల్టర్ ఎందుకు అంత ముఖ్యం..?
ప్యూరిఫైయర్ కొనేటప్పుడు ప్రధానంగా చూడాల్సింది 'హెపా ఫిల్టర్' అంటే హై ఎఫిసెన్సీ పర్టిక్యులేట్ ఎయిర్(HEPA). గాలిలోని అతి సూక్ష్మమైన PM2.5 కణాలను సైతం ఇది సులభంగా ఒడిసిపట్టు కుంటుంది. అయితే, ఇది ప్రమాదకరమైన వాయువులను, చెడు వాసనలను పూర్తిగా తొలగించలేదు. వాటిని కూడా అడ్డుకోవాలంటే 'యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్' (Activated Carbon Filter) తప్పనిసరిగా ఉండాలి.
CADR రేటింగ్.. తప్పక గమనించాలి..!
CADR (క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్) అనేది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ ఎంత వేగంగా స్వచ్ఛమైన గాలిని అందించగలదో సూచిస్తుంది. మీ గది పరిమాణాన్ని బట్టి తగిన CADR రేటింగ్ ఉన్న మెషీన్‌ను ఎంచుకోవాలి. పెద్ద గదులు, హాళ్ల కోసం ఎక్కువ CADR ఉన్న ప్యూరిఫైయర్ అవసరం. ఫిల్టర్ల నాణ్యత, వాటిని భవిష్యత్తులో మార్చడానికి (Replacement) అయ్యే ఖర్చును ముందే అంచనా వేసుకోవాలి.
విషవాయువులను ఇవి అడ్డుకుంటాయా..?
హెపా ఫిల్టర్ కేవలం గాలిలోని ఘన కణాలను మాత్రమే నిలువరి స్తుందని గుర్తుంచుకోవాలి. కార్బన్ మోనాక్సైడ్ లాంటి ప్రమాదకర మైన వాయు కాలుష్యాలను అడ్డుకోవడం సాధారణ ఫిల్టర్ల వల్ల కాదు. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు కొంతమేరకు ప్రమాదకర వాయువులు, వాసనలను తగ్గించగలవు.
పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో ఇంట్లో గాలి నాణ్యతను పెంచుకునేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్ ఒక మంచి ప్రత్యామ్నాయం. అయితే కొనుగోలు చేసేటప్పుడు కేవలం బ్రాండ్, ధర మాత్రమే కాకుండా హెపా ఫిల్టర్ ఉందా లేదా..?, CADR రేటింగ్ ఎంత..?, గది విస్తీర్ణానికి సరిపోతుందా లేదా..? అన్నది చూసుకోవాలి. ప్యూరిఫైయర్ ఇంట్లోని కాలుష్య తీవ్రతను తగ్గిస్తుందే తప్ప, దీన్ని వంద శాతం రక్షణ కవచం అని మాత్రం భావించకూడదు.
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
