హార్ట్ హెల్త్ కోసం బెస్ట్ ఫుడ్ 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: కొన్నిరకాల ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మరికొన్ని ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అటువంటి వాటిలో గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఆహారపు అలవాట్ల గురించి అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఆకు కూరలలో విటమిన్ "కే "తోపాటు నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలోను, ధమనుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ.

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

బెర్రీస్..

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని పెంచుతాయి.  తృణధాన్యాలు మాత్రం గుండె ను సంరక్షిస్తాయి. బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని తినడం వల్ల గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. కాబట్టి స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటివి తప్పనిసరిగా తినాలి. 

ట్రైగ్లిజరైడ్స్..

కొవ్వు చేపలు, చేప నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్‌తో సహా గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గించడంలో సహాయపడుతాయి. కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో వాల్‌నట్స్ ఎంతగానో  సహాయపడతాయి. అంతేకాదు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.