Fiber : కడుపు శుభ్రం చేయడమే కాదు.. గుండె, పేగుల ఆరోగ్యానికి ఫైబర్ ఎంతో ముఖ్యం..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పీచు పదార్థం(fiber) గురించిన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో, హెల్త్ ట్రెండ్స్‌లో జోరుగా సాగుతోంది. అయితే ఇది కేవలం ఒక ఫ్యాషన్ మాత్రమే కాదని, దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. తగినంత ఫైబర్ తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు, కొలొరెక్టల్ క్యాన్సర్‌తో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, చాలా మంది నిత్య జీవితంలో తగిన మోతాదులో ఫైబర్‌ను తీసుకోవడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

రోజువారీగా ఎంత ఫైబర్ అవసరం..?

మహిళలకు.. ప్రతిరోజూ 25 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. పురుషులకు..ప్రతిరోజూ 38 గ్రాముల ఫైబర్ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. గత గణాంకాలను పరిశీలిస్తే, చాలా మంది కేవలం సగటున రోజుకు 16 గ్రాముల ఫైబర్ మాత్రమే తీసుకుంటున్నారని, తమ శరీరానికి అవసరమైన పూర్తి స్థాయి పీచు పదార్థాన్ని పొందలేకపోతున్నారని తేలింది. కాబట్టి రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవడం ద్వారా గుండె,పేగుల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.