సాక్షి లైఫ్ : బ్లాక్ సాల్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు: బ్లాక్ సాల్ట్ ను ప్రతి ఇంట్లో ఆహార పదార్థాలలో, పానీయాలలో ఉపయోగిస్తారు. కాల్షియం, ఐరన్ ,మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ ఉప్పు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయ పడుతుంది. నల్ల ఉప్పుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం..
వంటగదిలో కనిపించే కొన్నిపదార్థాలు సాధారణమైనవిగా అనిపించ వచ్చు. కానీ వాటిలో దాగిఉన్న ప్రయోజనాలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అటువంటి వాటిలో నల్ల ఉప్పు ఒకటి. నల్ల ఉప్పు సరైన పరిమాణంలో తినడం ద్వారా, జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
బ్లాక్ సాల్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు..
వంటగదిలో అందుబాటులో ఉండే బ్లాక్ సాల్ట్ (నల్ల ఉప్పు)చాట్ లేదా సలాడ్ అయినా వాటి రుచిని పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.
ఎసిడిటీ నుంచి ఉపశమనం..
గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు ఉంటే నల్ల ఉప్పు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని పలు అధ్యయనాలలో కూడా తేలింది.
మెరుగైన జీర్ణక్రియ..
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి చిటికెడు నల్ల ఉప్పుతో ఆయా సమస్యలనుంచి సులభంగా బయటపడొచ్చు. అంతేకాదు కడుపు నొప్పి ఉన్నవారికి కూడా నల్ల ఉప్పు బాగా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యానికి..
చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి నల్లఉప్పు సరైన పరిష్కారం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గడానికి..
బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. నల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. తినే ఆహారంలో గానీ, తాగే పానీయాల్లో గానీ నల్లఉప్పు చేర్చుకుంటే, అది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలను బయటకు పంపి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ఇది కూడా చదవండి.. సింకోప్ అంటే ఏమిటి.. దీనికి ప్రధాన కారణాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com