Allergy Pills : అలర్జీ మాత్రలు దీనికోసం వాడుతున్నారా..? సోషల్‌ మీడియా ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతీ చిట్కాను గుడ్డిగా నమ్మితే ఎంతటి ప్రమాదమో మరోసారి రుజువవుతోంది. అందం, ఆరోగ్యం పేరుతో నిత్యం ఎన్నో పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంటాయి. అయితే ఇటీవల టిక్‌టాక్‌ వంటి వేదికల్లో ప్రచారమవుతున్న ఒక ప్రమాదకర ధోరణి వైద్య నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యోని బిగుతు కోసం సాధారణంగా అలర్జీలకు వాడే సెటిరిజిన్ (Cetirizine) మాత్రలను ఉపయోగించాలంటూ కొన్ని వీడియోలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇది పూర్తిగా అశాస్త్రీయమని, తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని గైనకాలజిస్టులు తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

అసలేంటీ వింత ప్రచారం..?

కెన్యా తదితర దేశాల్లో ప్రారంభమైన ఈ పోకడ ప్రస్తుతం ఇతర ప్రాంతాలకూ వ్యాపిస్తోంది. దురద, జలుబు, తుమ్ములు వంటి అలర్జీల నివారణకు నోటి ద్వారా వేసుకునే సెటిరిజిన్ మాత్రలను యోని మార్గంలో చొప్పించుకుంటే (Vaginal insertion) సహజ తేమ తగ్గి, బిగుతుగా మారుతుందనేది ఈ వీడియోల సారాంశం.. దీనిపై కెన్యా ఫార్మాస్యూటికల్ సొసైటీతో పాటు వైద్య మండళ్లు ఇప్పటికే స్పందించి, ప్రజలను అప్రమత్తం చేశాయి. సెటిరిజిన్ అనేది కేవలం అలర్జీల ఉపశమనానికి నోటి ద్వారా తీసుకునే ఔషధం మాత్రమేనని, దీన్ని యోనిలో ఉంచడానికి ఎలాంటి వైద్య ఆమోదం లేదని స్పష్టం చేశాయి.

వైద్యులు ఏమంటున్నారు..?

అలర్జీ మాత్రలు యోనిని బిగుతుగా చేస్తాయనడం పూర్తిగా అపోహ మాత్రమేనని గురుగ్రామ్ సీఐఎఫ్‌ఏఆర్ పునరుత్పత్తి ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ పునీత్ రాణా అరోరా వివరించారు. యాంటీహిస్టమైన్లు శ్లేష్మ పొరలను (mucous membranes) పొడిబారేలా చేస్తాయి. దీనివల్ల యోనిలో సహజంగా ఉండే ద్రవాలు తగ్గిపోయి తాత్కాలికంగా పొడిగా, బిగుతుగా అనిపించవచ్చు. అయితే ఇది కండరాలు గట్టిపడటం ఎంతమాత్రం కాదు.

దుష్ప్రభావాలు..

సహజ తేమ తగ్గడం వల్ల లైంగిక కలయిక సమయంలో తీవ్రమైన రాపిడి, మంట, నొప్పులు ఏర్పడతాయి. మాత్రలను యోని మార్గంలో ఉంచడం వల్ల సున్నితమైన కణజాలం దెబ్బతిని తీవ్ర ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. శరీర అంతర్గత సమస్యలు..నోటి ద్వారా అనవసరంగా మోతాదుకు మించి ఈ మాత్రలు వాడితే నోరు ఎండిపోవడం, మలబద్ధకం, మైకం, తీవ్రమైన మగత, మూత్రవిసర్జనలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయి.

సరైన మార్గాలేవి..?

వయసు పెరగడం, ప్రసవాలు, శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు, మెనోపాజ్ వంటి కారణాల వల్ల యోని కణజాలంలో, కటి కండరాలలో మార్పులు రావడం పూర్తిగా సహజమైన శారీరక ప్రక్రియ. యోని వదులుగా మారినట్లు అనిపించినా, విపరీతమైన పొడిబారినట్లు ఉన్నా సొంత వైద్యాలు చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.

కీగెల్ వ్యాయామాలు (Kegel Exercises)పెల్విక్ ఫ్లోర్ (Pelvic Muscles) బలాన్ని పెంచడానికి నిపుణులు సూచించే వ్యాయామాలు ఎంతో సురక్షితమైనవి, ప్రభావవంతమైనవి.

సంతానలేమి అపోహలు వద్దు.. యోని వదులుగా ఉండటానికీ, అండాల నాణ్యత లేదా గర్భధారణ సామర్థ్యానికీ ఎలాంటి సంబంధం లేదు. అయితే విపరీతమైన పొడిబారడం వల్ల కలయిక కష్టమై గర్భధారణ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. సామాజిక మాధ్యమాల్లో లైకులు, వ్యూస్‌ కోసం చేసే ప్రమాదకర ప్రయోగాలను గుడ్డిగా అనుసరించవద్దు. శరీరంలోని సున్నితమైన భాగాల విషయంలో నిపుణులైన వైద్యుల సలహాలు మాత్రమే పాటించాలి.

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.