దాహంగా లేకపోయినా నీరు తాగుతున్నారా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యానికి నీరు త్రాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కొంతమంది దాహం వేయకుండా నీటిని తాగుతారు. అది ప్రయోజనకరమా..? హానికరమో తెలియకుండానే తాగుతుంటారు. నిజానికి, శరీరానికి అత్యంత ముఖ్యమైన అంశం నీరు. ఇది శరీరం ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు,  గ్లూకోజ్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది. ఎక్కువగా తాగితే ఏమౌతుంది..? 

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 నీటి కొరత..

నీరు శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలో నీటి కొరత ఉంటే అనేక రకాల వ్యాధులు వస్తాయి. అందుకోసమే ఎక్కువ నీళ్ళు తాగాలి. కానీ కొందరు అవసరానికి మించి ఎక్కువ నీరు తాగుతారు. దీని గురించి వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

వేసవిలో రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. సాధారణంగా, మన శరీరానికి నీరు అవసరమైనప్పుడు, దాహం ద్వారా  ఆ విషయం తెలుస్తుంది.

దాహం అవ్వకుండా నీరు తాగితే ప్రయోజనం ఉండదు. మీరు బలవంతంగా నీరు తాగితే, శరీరానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు, దీనికి బదులుగా అది హాని కలిగిస్తుంది. కాబట్టి దాహం వేసినప్పుడే నీరు తాగాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. తక్కువ నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ అవ్వడమే కాకుండా కిడ్నీలో రాళ్ల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఎవరికైనా కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. దీని వల్ల రాయి మూత్రం ద్వారా బయటకు వస్తుంది.

 ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.