శిరోజాల పోషణలో అద్భుతమైన ఫలితాలనిచ్చే అల్లం..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వంటింట్లో అందుబాటులో అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేద వైద్యంలో దీనికి చాలా  ప్రాముఖ్యత ఉంది. అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే అస్సలు వదలరు. ముఖ్యంగా కఫం, జలుబు, దగ్గు వంటి సమస్యలకు అల్లం సరైన నివారిణి. అలాంటి అల్లం జుట్టు సంరక్షణ ఎంతో ఉపయోగపడుతుంది.  

అల్లం జట్టు పోషణకు ఉపపయోగపడుతుంది. కురులను దృఢంగా చేసి జుట్టు రాలకుండా అల్లం సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు అల్లం శిరోజాలకు నిజంగా పనిచేస్తుందో లేదో..?జుట్టుకి ఎలా రాయాలి..? అనేదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

జింక్, మెగ్నీషియం వంటివి అల్లంలో ఉన్నాయి. ఇవి శిరోజాల సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అల్లం రసాన్ని జుట్టుకు అప్లై చేయడం ద్వారా జుట్టు రాలు సమస్య నుంచి బయట పడొచ్చు. ఇలా చేయడంవల్ల జుట్టు బలంగా మారుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఫంగల్ గుణాల కారణంగా హెయిర్ మరింత బలంగా మారుతుంది.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.