Mouth Taste Bitter in the Morning : పొద్దున్నే నోరు చేదుగా అనిపించడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : ఉదయం లేవగానే వేడి వేడి టీ లేదా కాఫీతో రోజును ఉత్సాహంగా ప్రారంభించాలని అందరూ కోరుకుంటారు. కానీ, నిద్రలేవగానే నోట్లో ఏదో వింత రుచి, చేదుగా లేదా పుల్లగా అనిపిస్తుంటుంది. రాత్రి తిన్న భారీ భోజనం, ఉల్లి, వెల్లుల్లి లాంటి ఆహారాలే దీనికి కారణమని చాలామంది పొరబడుతుంటారు. కానీ, దాని వెనుక కేవలం ఆహారం మాత్రమే కాకుండా ఇతర అనారోగ్య కారణాలు కూడా దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
1. లాలాజలం ఉత్పత్తి తగ్గడం..
పగటిపూట మన నోటిలో ఊరే లాలాజలం సహజమైన మౌత్‌వాష్‌లా పనిచేస్తుంది. ఇది ఎప్పటికప్పుడు నోట్లోని బ్యాక్టీరియాను, ఆహారపు కణాలను శుభ్రం చేస్తుంది. కానీ రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు లాలాజల ఉత్పత్తి దాదాపుగా ఆగిపోతుంది. దీనివల్ల నోరు పొడిబారి బ్యాక్టీరియా వేగంగా పెరిగి, అవి విడుదల చేసే రసాయనాల వల్ల ఉదయం లేవగానే నోట్లో వింత రుచి వస్తుంది.
2. నోరు తెరిచి నిద్రపోవడం లేదా గురక..
కొంతమందికి నిద్రలో ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా గాలి పీల్చుకునే అలవాటు ఉంటుంది. లేదా గురక సమస్య ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల నోరు మరింత పొడిబారుతుంది. నోరు ఎంత పొడిగా ఉంటే బ్యాక్టీరియా అంత ఎక్కువగా వృద్ధి చెంది, రుచిని చెడగొడుతుంది.
3. యాసిడ్ రిఫ్లక్స్ సమస్య..
రాత్రి పడుకున్నప్పుడు కడుపులోని ఆమ్లాలు (Acid reflux) వెనక్కి తన్ని అన్నవాహిక ద్వారా గొంతు, నోట్లోకి చేరడాన్ని 'యాసిడ్ రిఫ్లక్స్' (Acid Reflux) అంటారు. గ్యాస్ లేదా ఎసిడిటీ సమస్య ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఆమ్లాల వల్ల ఉదయం నిద్రలేవగానే నోరు పుల్లగా లేదా చేదుగా మారుతుంది.
4. డీహైడ్రేషన్..
రోజంతా తగినంత నీరు తాగకపోవడం వల్ల లేదా పడుకునే ముందు నీళ్లు తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని ప్రభావం నోటిపై పడి, లాలాజలం సరిగ్గా ఉత్పత్తి కాదు. ఫలితంగా నోరు పొడిబారి బ్యాక్టీరియా చేరి రుచిని మార్చేస్తుంది.
5. నాలుకను సరిగ్గా శుభ్రం చేయకపోవడం..
చాలామంది ఉదయం, రాత్రి పళ్లు తోముకుంటారు కానీ, నాలుకను శుభ్రం చేయడం మర్చిపోతారు. మన నాలుక ఉపరితలంపై ఉండే సూక్ష్మమైన రంధ్రాల్లో బ్యాక్టీరియా, మృత కణాలు పేరుకుపోతాయి. రాత్రంతా అవి అక్కడే ఉండటం వల్ల ఉదయం నోటి రుచి పూర్తిగా మారుతుంది.
పరిష్కారం ఏమిటి మరి..?
ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకోవడంతో పాటు టంగ్ క్లీనర్‌తో నాలుకను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంటే డాక్టర్‌ను సంప్రదించి ఎసిడిటీ లేదా ఇతర సమస్యలకు చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
