లిచీ ఫ్రూట్ లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు.. 

షేర్ చేయండి:
లిచీ ఫ్రూట్ లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు.. 

సాక్షి లైఫ్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు ఈ సీజన్ లో వచ్చే పండ్లు నోరు ఊరిస్తుంటాయి.. లిచీ పండులో మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలున్నాయి. ఎండలు పెరిగినప్పుడు మనల్ని హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. లిచీ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..

లిచీ అనేది వేసవిలో లభించే పండు. ఇది భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. ఈ పండు చాలా జ్యుసిగా, తీపిగా ఉంటుంది. ఈ పండును ఒక్కసారి రుచి చూస్తే దాన్ని మర్చిపోవడం చాలా కష్టం. లిచీని జ్యూస్, ఐస్ క్రీం లేదా మాక్‌టైల్ రూపంలో తినవచ్చు. రుచితో పాటు, లిచీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పండులో అధిక మొత్తంలో నీరు కూడా ఉంటుంది. ఇది వేసవిలో శరీర హైడ్రేషన్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. 


లిచీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి లిచీలో లభిస్తుంది. ప్రతిరోజూ లిచీ పండ్లను తినడం వల్ల స్ట్రోక్ రిస్క్ 42శాతం తగ్గుతుందని, శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 
 యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం.. 

 ఇతర పండ్ల కంటే లిచీలో ఎక్కువ పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్, మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లిచీలో అధిక మొత్తంలో రుటిన్ కూడా ఉంటుంది. క్యాన్సర్, మధుమేహం,గుండె సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మానవ శరీరాన్ని రక్షించడంలో రుటిన్ సహాయపడుతుంది.

ఇది కాలేయ క్యాన్సర్‌తో పోరాడగలదు..
      
లిచీ ఫ్రూట్ పెరికార్ప్ (LFP) సారం క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఇది కాలేయ క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. లిచిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. లిచీలో విటమిన్ ఇ పుష్కలంగా ఉందని, ఇది నొప్పి, వడదెబ్బలను నయం చేయడంలో సహాయ పడుతుంది. అంతేకాదు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది.


లిచీలోపండు.. 

లిచీలో ఫ్లేవనోల్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వేసవిలో వచ్చే ఫ్లూ, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతాయి.    

ఇది కూడా చదవండి.. చిన్న సూదితో రోగాలు నయమవుతాయా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.