మండుటెండల్లో చల్లగా ఉంచే సమ్మర్ హెల్తీ డ్రింక్.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు భగ, భాగ పొగలు కక్కుతున్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. రెండు తెలుగురాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవు తున్నాయి. ఈ నేపథ్యంలో చల్లగా ఉండడంతో పాటు, వేసవి కాలంలో ఎనర్జిటిక్ గా ఉండడంకోసం ఆరోగ్యకరమైన ఆహారాలు, పానీయాలు అవసరం. అందుకోసం సమ్మర్ హెల్తీ డ్రింక్స్ తీసుకోవాలి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ పానీయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


 ఇది కూడా చదవండి..రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

సొరకాయ జ్యూస్.. 

సొరకాయ జ్యూస్ ఖాళీ కడుపుతో తాగాలి. ఈ జ్యూస్ శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఎండ దెబ్బ తగలకుండా చేస్తుంది. 

తయారీ విధానం..?

సొరకాయను బాగా కడగాలి. పీలర్ సహాయంతో పొట్టు తీయండి. ఇప్పుడు దాని గింజలను తీసి చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆ ముక్కలను  జ్యూసర్‌లో వేసి,కొంచెం నీరు పోసి మెత్తగా అయ్యేలా చేయండి. ఆ తర్వాత ముక్కలను తొలగించడానికి ఆ మిశ్రమాన్ని జల్లెడతో వడకట్టండి. సొరకాయ రసం రెడీ. ఇలా సొరకాయ జ్యుస్ చేసుకొని తాగడం ద్వారా మండువేసవిలోనూ చల్లగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. 

ఇది కూడా చదవండి.. ఎలాంటి రోగాలకు యునాని ఉపయోగపడుతుంది..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.