The Fiber Formula for Good Health : ఆరోగ్యానికి 'ఫైబర్'మంత్రం : మీ ఆహారంలో ఫైబర్ తగినంత ఉంటోందా..?
సాక్షి లైఫ్ : శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి సరైన పోషకాహారం చాలా అవసరం. మనం సాధారణంగా తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, క్యాల్షియం, ఐరన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాం కానీ, అత్యంత కీలకమైన 'పీచుపదార్థం' (dietary fiber) గురించి తరచుగా మర్చిపోతుంటాం. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో జంక్ ఫుడ్, మైదాతో చేసిన ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం ఎక్కువైపోయింది. దీనివల్ల శరీరానికి తగినంత ఫైబర్ అందక మలబద్ధకం, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు వస్తున్నాయి. అయితే, ఫైబర్ లోపాన్ని భర్తీ చేయడానికి ఖరీదైన సప్లిమెంట్లు వాడాల్సిన అవసరం లేదు. మన రోజువారీ ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
రోజుకు ఎంత ఫైబర్ అవసరం..?
భారతీయ వైద్య పరిశోధన మండలి- జాతీయ పోషకాహార సంస్థ (ICMR-NIN) మార్గదర్శకాల ప్రకారం.. రోజుకు సగటున వయోజన పురుషులు సుమారు 30 గ్రాములు, మహిళలు 25 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ తీసుకున్నప్పుడు అది శరీరంలో సక్రమంగా పనిచేయాలంటే తగినన్ని నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం.
ఫైబర్ ఎందుకంత ముఖ్యం అంటే..?
మలబద్ధకానికి చెక్..ఇది మలాన్ని మృదువుగా చేసి, విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. మలబద్ధకం దరిచేరనివ్వదు. బరువు నియంత్రణ..ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే పొట్ట త్వరగా నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల పదే పదే ఆకలి వేయదు, చిరుతిళ్లపైకి మనసు మళ్లదు. షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఇది నివారిస్తుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను (Bad Cholesterol) తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పేగుల ఆరోగ్యం..దీర్ఘకాలం పాటు డైట్లో ఫైబర్ లోపిస్తే పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. తగినంత ఫైబర్ తీసుకోవడం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
పీచుపదార్థం పెంచుకోవడానికి ఆహారంలో చేయాల్సిన మార్పులు..
1. తృణధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వండి..
మైదాతో చేసిన బేకరీ వస్తువులకు బదులుగా గోధుమలు, ఓట్స్, బార్లీ, సజ్జలు, రాగులు వంటి తృణధాన్యాలను ఎంచుకోవాలి. ఉదయం అల్పాహారంగా ఓట్స్, లేదా భోజనంలో సజ్జ రొట్టెలు తినడం మంచి ప్రత్యామ్నాయం. వీటిద్వారా ఫైబర్‌తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా అందుతాయి.
2. పప్పు దినుసులు తప్పనిసరి..
పెసలు, ఎర్రకందిపప్పు, శనగలు, రాజ్మా వంటివి మన రెగ్యులర్ డైట్లో ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఫైబర్‌తో పాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
3. పండ్లను రసంగా కాకుండా.. ముక్కలుగానే తినాలి..
జామ, ఆపిల్, బేరిపండు (pear), నారింజ వంటి పండ్లలో ఫైబర్ మెండుగా ఉంటుంది. పండ్లను జ్యూస్‌లా చేసుకుని తాగితే అందులోని పీచుపదార్థం వృథా అవుతుంది. కాబట్టి పండ్లను ముక్కలుగా కోసుకుని తినడమే ఉత్తమం. ముఖ్యంగా ఆపిల్, బేరి వంటి పండ్లను బాగా కడిగి, పై తొక్కతో సహా తినడం వల్ల శరీరానికి గరిష్ట స్థాయిలో ఫైబర్ అందుతుంది.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
