పండ్లు తినేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే ఆరోగ్యానికి మరింత మేలు..   

షేర్ చేయండి:
పండ్లు తినేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే ఆరోగ్యానికి మరింత మేలు..   

సాక్షి లైఫ్ : పండ్లు తినేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా సీజనల్ ఫ్రూట్స్ రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, పండ్లు తినడానికి పలు రకాల నియమాలున్నాయి. అటువంటి వాటిలో ప్రధానమైంది సరైన సమయం. ఒకవేళ సరైన సమయంలో తీసుకోకపోతే  ప్రయోజనాలకు బదులుగా హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
హెల్తీగా ఉండాలంటే ఆహారంతోపాటు తాజా పండ్లు, కూరగాయలతో పాటు అన్ని పోషకాలనుతీసుకోవాలి. ఆహారంతో పాటు కూరగాయలు, ప్రోటీన్లను తీసుకుంటాము, కానీ చాలా సార్లు పండ్లు ఎక్కువగా తినరు కొందరు. మనరోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే.

ప్రత్యేక ప్రయోజనాలు..  

పండ్లు సహజమైనవి..సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లు సమృద్ధిగా ఉంటాయి.  ఇవి శరీరానికి శక్తిని, రోగనిరోధక శక్తిని ఇవ్వడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అవి అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు,ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి. ఇవి వాటి ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అయితే పండ్లను తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మీరు మీ ఆహారాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటున్నారా..? లేదా ఆరోగ్యకరమైన మార్పులు చేయాలనుకుంటున్నారా..? ఐతే వాటి పూర్తి ప్రయోజనాలను పొందడానికి పండ్లను ఎలా తినాలో తెలుసుకుందాం.. 
 
పండ్లను నేరుగా తినండి.. 

పండ్ల జ్యూస్ తాగడం కంటే నేరుగా పండ్లను తినడం మంచిది. ఎందుకంటే పండును జ్యూస్ చేయడం వల్ల అందులోని పీచు, విటమిన్లు, మినరల్స్ , ఎంజైములు కూడా పోతాయి. అంతేకాకుండా, జ్యూస్ కడుపులోకి వేగంగా చేరుతుంది. ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండడం కారణంగా, చక్కెర స్థాయి కూడా వేగంగా పెరిగి యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచడంవల్ల అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.

తిన్న తర్వాత పండ్లు తినకూడదు.. 

మీరు భోజనం తర్వాత పండ్లు తింటే, ఈ రోజు నుండి ఈ అలవాటును మానుకోండి. ఎందుకంటే పండు మీ కడుపులోకి వెళ్లిన ఆహారం కొద్దిసేపటికి పుల్లగా అవుతుంది. దీని వల్ల కడుపులో ఎక్కువ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా పండ్ల ద్వారా వచ్చే యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడంతో శరీరానికి దీని వల్ల ఎక్కువ ప్రయోజనాలు చేకూరవు.

పండ్లు తినే ముందు నట్స్ తినండి.. 

మీరు పండ్లు తినడానికి ముందు నట్స్ తింటే, అవి రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతాయి. కాబట్టి, పండ్లు తీసుకునే ముందు నట్స్ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి.. ఈ అపోహలను గురించి తప్పకుండా తెలుసుకోవాలి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.