ఈ అపోహలను గురించి తప్పకుండా తెలుసుకోవాలి.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చాలా కాలంగా సామాజంలో ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు,అనుమానాలు కొన్ని ఉన్నాయి. అసలు వాటిలో ఎంతవరకు నిజం, ఎంతవరకూ దుష్ప్రచారం అనేది ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన అనేక అపోహలు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. దీంతో నిజం తెలియక ప్రజలు వాటిని నమ్ముతున్నారు. అలాంటి కొన్ని అపోహలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

ఆరోగ్యానికి సంబంధించిన అనేక పుకార్లు సంవత్సరాలుగా కొనసాగు తున్నాయి. కొంతమంది ప్రజలు వాటిని తమ సౌలభ్యం ప్రకారం నమ్ముతారు, కొన్నిసార్లు తిరస్కరిస్తూ ఉంటారు. కొన్ని విషయాలపై స్పష్టత లేకపోవడంతో ఏళ్ల తరబడి అనుసరిస్తూ ఉన్నారు కొందరు. అయితే ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి ఎన్నో అపోహలు సమాజంలో వ్యాప్తి చెందుతున్నాయని మీకు తెలుసా..? కొందరు వాటిని గుడ్డిగా అనుసరిస్తూ ఉన్నారు కానీ అవి నిజం కాదు.  

అపోహ : వేళ్లు పగలడం వల్ల ఆర్థరైటిస్ వస్తుందా..?

ఇది వాస్తవం కాదు. వేళ్లు పగలడం అనేది ఒక సాధారణ భౌతిక ప్రక్రియ. దీనిలో కీళ్ల మధ్య కార్బన్ డయాక్సైడ్ బుడగలు పగిలిపోవడం వల్ల గ్యాస్ విడుదల అవుతుంది. అప్పుడు వేళ్ళు మిగిలినట్లుగా అనిపిస్తాయి. ఐతే వేళ్లు పగలడం అనేది ఆర్థరైటిస్‌ సమస్య కాదని వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. 

  టీకా వల్ల ఫ్లూ వస్తుందా.. ?

వ్యాక్సిన్‌లు వ్యాధిని అరికట్టడానికి ఉపయోగిస్తున్నప్పటికీ, కొంతమంది టీకా అనగానే పారిపోతారు. టీకాలు వేయడం వల్ల ఫ్లూ సోకే అవకాశం ఉందని వారు భావిస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం నిజం కాదు. పూర్తిగా తప్పు. వ్యాక్సిన్‌లో వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా చాలా తక్కువ పరిమాణంలో శరీరంలోకి ఎక్కిస్తారు. తద్వారా ఆ బ్యాక్టీరియాతో పోరాడటానికి శరీరంలో యాంటీబాడీస్ ఏర్పడతాయి. 

భవిష్యత్తులో ఎప్పుడైనా ఆయా వ్యాధితో పోరాడడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, టీకా ఫ్లూకి కారణమవుతుందని భావించడం చాలా తప్పు. ఇది కేవలం అపోహ మాత్రమే.. టీకా తీసుకున్న తర్వాత జ్వరం రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చినా తగ్గిపోతుంది. అంతమాత్రం చేత అది ఫ్లూ కాదు. దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు.  

 కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరమా..?

అన్ని రకాల కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం కాదు. చెడు కొలెస్ట్రాల్ ఎల్‌డిఎల్ గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అయితే మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డిఎల్ కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి పనిచేస్తుంది. అంతేకాదు ఇది చెడు కొలెస్ట్రాల్ ప్రభావాన్ని తగ్గించి, రక్త నాళాల గోడలను దృఢంగా ఉంచుతుంది. కాబట్టి అన్ని రకాల కొలెస్ట్రాల్స్ హానికరం అని నమ్మడం కరెక్ట్ కాదు.

ఇది కూడా చదవండి.. Myths - Facts : నలుపు రంగు బ్రా ధరించడం వల్ల క్యాన్సర్ వస్తుందా..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.