సేంద్రీయ పంటలకు, పురుగుమందులు వేసి పండించిన పంటలకు ఏంటి తేడా..?
సాక్షి లైఫ్ : ఇటీవల మార్కెట్లో సేంద్రియ ఆహారపదార్థాలు, ఇతర పంటలకు డిమాండ్ బాగా పెరిగింది. ఆర్గానిక్ పద్ధతుల్లో పండినవి బెస్ట్ అని నమ్ముతారు. ఆర్గానిక్‌లో పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు మాత్రమే కాదు ప్రతి పంట ఆర్గానిక్ పద్ధతుల్లో పండించవచ్చు. అయితే.. ఆర్గానిక్ వల్ల ఏం లాభం లేదనే వాళ్లూ ఉన్నారు. అలాగే.. ఆర్గానిక్ ఫుడ్ బెస్ట్ అని చెప్పేవాళ్లూ ఉన్నారు.
ఇది కూడా చదవండి.. మహిళలకు రిగ్యులర్ గా ఎలాంటి హెల్త్ చెకప్స్ అవసరం..?
అయితే.. వీళ్లలో ఆర్గానిక్ బెస్ట్ అని చెప్పేవాళ్ల సంఖ్యే ఎక్కువ. ఆర్గానిక్ పద్ధతిలో ధాన్యాన్ని నేచురల్‌గా పండిస్తారు. అంటే.. పెరుగుదల కోసం, చీడ, పీడలను కంట్రోల్ చేయడానికి ఎలాంటి కెమికల్స్ వాడరు. పశువుల పేడ, ప్రకృతి ప్రసాదించిన సహజ ఉత్పత్తులను మాత్రమే వాడతారు. దీని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది.
భూమిలో సారం పెరుగుతుంది. మన ముందు తరాలకు నాణ్యమైన వనరులను అందించినవాళ్లం అవుతాం. పైగా పురుగుమందులు వాడడం వల్ల ఎంతోమంది రైతులు అనారోగ్యం పాలవుతున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే అలాంటి సమస్యలు ఉండవు. ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ఎంకరేజ్ చేయడం వల్ల రైతులను కాపాడుకున్నవాళ్లం అవుతాం.
అంతేకాదు ఆర్గానిక్ పండ్లు, కూరగాయల్లో హాని చేసే కెమికల్స్ ఉండవు. సేంద్రియ పద్దతిలో పండించిన పండ్లు, కూరగాయల్లో ఎక్కువగా విత్తనాలుంటాయి. అదే పురుగుమందులు ఎక్కువగా వేసి పండించిన వాటిలో చాలా తక్కువ విత్తనాలుంటాయి. ఆర్గానిక్ పంటల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. పురుగుమందులతో పండించిన పంటలతో చాలా దుష్ప్రభావాలుంటాయి.
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
