ఏసీ చల్లదనం నుంచి మండే ఎండలోకి వెంటనే ఎందుకు వెళ్లకూడదంటే..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వేడిగాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి సూర్యుడు తన ప్రతాపాన్నిచూపించడం మొదలుపెడుతున్నాడు. దీంతో ఎండ తీవ్రతతోపాటు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమికి, వడదెబ్బకు ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. దీనిని నివారించడానికి, వైద్యులు ప్రజలు వేసవి కాలంలో పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి.. లివర్ డ్యామేజ్ అయితే ఏం జరుగుతుంది..?  

సన్ స్ట్రోక్ నుంచి సురక్షితంగా ఉండేందుకు అవసరమైన చిట్కాలు తప్పనిసరిగా పాటించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.  
ఏసీ చల్లదనం నుంచి మండే ఎండలోకి వెంటనే అడుగు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది..? అంటే ఏసీ నుంచి వెంటనే ఎండలోకి వెళితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని అంటున్నారు డాక్టర్లు. ఖాళీ కడుపుతో ఎండలోకి వెళ్లవద్దని, దీంతో పాటు ఏసీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎండలోకి వెళ్లకుండా చూడాలని ప్రజలకు సూచిస్తున్నారు.
 
ఏసీ నుంచి వెంటనే ఎండలోకి ఎందుకు రావొద్దంటే..?  


 ప్రస్తుతం ప్రజలు తమ ఇళ్లతోపాటు బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎయిర్ కండీషనర్లను ఉపయోగిస్తున్నారు. ప్రజలు మాల్స్, రెస్టారెంట్లు, వివిధ ప్రభుత్వ,ప్రభుత్వేతర భవనాలకు వెళతారు, అక్కడ ఏసీ ఉంటుంది. ఆయా ప్రదేశాల్లో పని పూర్తిచేసుకున్న వెంటనే ఎండలోకి వెళతారు. ఏసీ నుంచి నేరుగా వెంటనే ఎండలోకి వెళ్లడం వల్ల ఎండదెబ్బ తగిలి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 

ఖాళీ కడుపుతో ఎండలోకి వెళ్లొద్దు..  

 ఎండలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఖాళీ కడుపుతో  బయటకు వెళ్లొద్దు. భోజనం చేసిన తర్వాత మాత్రమే వెళ్లండి. శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా నీరు ఎక్కువగా తాగాలి.

శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించండి. 

అలాగే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండే దుస్తులను ధరించండి. హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ ధరించడం మానుకోండి. వడదెబ్బ విషయంలో, వైద్యుడిని సంప్రదించండి. డాక్టర్ ను సంప్రదించకుండా మందులు తీసుకోకండి. ఇది సమస్యను మరింత పెంచవచ్చు.

ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.