శరీరంలో జింక్ లోపిస్తే ఏం జరుగుతుంది..?
సాక్షిలైఫ్ : శరీరంలోని అనేక విధులను సక్రమంగా నిర్వర్తించడంలో జింక్ చాలా ముఖ్యమైంది. ఇది మన శరీరంలో వివివిధ అవయవాలు సరిగా పనిచేయడానికి అవసరమైన ప్రధానమైన పోషకం. ఐతే జింగ్ లోపించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో జింక్ అధికంగా ఉండే వాటిని చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉంచడంలో జింక్ పాత్ర చాలా కీలకమైంది.
ఇది కూడా చదవండి.. ఆటిస్టిక్ ప్రైడ్ డేని జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి..?
ఇది కూడా చదవండి.. గుండెలో మంట..? నొప్పి..? వీటిలో తేడాను ఎలా గుర్తించవచ్చు..?
ఎలాంటి సమస్యలు వస్తాయంటే..?
రోగనిరోధక శక్తి తగ్గుతుంది. శరీరంలో ఎక్కడైనా గాయాలు అయితే నయం కావడానికి చాలా సమయం పడుతుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా జింక్ అవసరం. జింక్ లోపం కళ్లను బలహీనపరుస్తుంది. దృష్టిలోపాలు వస్తాయి.
శరీరంలో జింక్ లోపిస్తే కనిపించే లక్షణాలు..
వాసన,రుచి తగ్గుతుంది
ఆకలి తగ్గుతుంది
తరచుగా అనారోగ్యానికి గురవుతారు
కంటి చూపు తగ్గుతుంది
పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుంది
మగవారిలో వంధ్యత్వ సమస్యలు
జుట్టు రాలు సమస్య
బాగా అలసటగా అనిపిస్తుంది
గాయాలు చాలా నెమ్మదిగా నయం అవుతాయి
బరువు పెరుగుతారు
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి..యోగా చేస్తే డిప్రెషన్ తగ్గుతుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
