ఆటిస్టిక్ ప్రైడ్ డేని జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి..?
సాక్షి లైఫ్ :ఆటిజం అనేది మెదడు అభివృద్ధి సమయంలో సంభవించే నాడీ సంబంధిత రుగ్మత. పిల్లలలో మూడుసంవత్సరాల వయస్సు వచ్చే ముందు కూడా ఈ రుగ్మత వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి లక్షణాల విషయంలో ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తాయి.ఆటిజంతో బాధపడుతున్న 40శాతం మంది పిల్లలు మాట్లాడలేరు.
ఇది కూడా చదవండి.. గుండెలో మంట..? నొప్పి..? వీటిలో తేడాను ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి..యోగా చేస్తే డిప్రెషన్ తగ్గుతుందా..?
ఆటిస్టిక్ ప్రైడ్ డే..
ఆటిజం గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 18వతేదీన ఆటిస్టిక్ ప్రైడ్ డేని జరుపుకుంటారు. ఈ రోజు ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించి వారిలో మనో నిబ్బరాన్ని కలిగిస్తారు. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు నేర్చుకోవడంలోనూ, అర్థం చేసుకోవడంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
అయితే ఆటిస్టిక్ ప్రైడ్ డే చరిత్ర ఏంటో తెలుసా? ఆటిస్టిక్ ప్రైడ్ డేని జరుపుకోవడం బ్రెజిల్ నుంచి ప్రారంభమైంది. ఆటిస్టిక్ ప్రైడ్ డేని మొదటిసారిగా 2005లో ఆస్పీస్ ఫర్ ఫ్రీడమ్ జరుపుకుంది. ఆ రోజు నుంచి నేటి వరకు, ప్రతి సంవత్సరం జూన్ 18న ఆటిస్టిక్ ప్రైడ్ డే జరుపుకుంటారు.
ఆస్పిస్ ఫర్ ఫ్రీడం అంటే ఏమిటి?
ఆస్పిస్ ఫర్ ఫ్రీడం(ఏఎఫ్ఎఫ్) అనేది ఆటిజం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పని చేసే ఓ సంఘం. అస్పిస్ ఫర్ ఫ్రీడమ్ 2004లో ఆటిస్టిక్ వ్యక్తుల సంరక్షణ కోసం ఆవిర్భవించింది. ఆటిజం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, వారికి పూర్తి సమాచారం అందించడం దీని ప్రధాన లక్ష్యం.
ఆటిస్టిక్ ప్రైడ్ డే ఉద్దేశ్యం..
ఆటిస్టిక్ ప్రైడ్ డేని జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడం. ఆటిజంతో బాధపడుతున్న పిల్లల ఆకాంక్షలు, అవకాశాలు సాధారణ పిల్లల కంటే కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పడం. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు మంచి వాతావరణం, అద్భుతమైన అవకాశాలను అందించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న మరొక లక్ష్యం. ఆటిస్టిక్ ప్రైడ్ డే ను జరుపుకోవడానికి, ప్రజలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు, కథనాలను పంచుకోవడం ద్వారా ఒకరికొకరు అవగాహన కల్పిస్తారు. ఇది కాకుండా, వివిధ సంస్థలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
ఆటిజం లక్షణాలు..?
పిల్లలు పుట్టి రెండు సంవత్సరాల వరకు మాట్లాడకపోవడం, భాషా నైపుణ్యాలు లేకపోవడం, సామాజిక నైపుణ్యాలు లేకపోవడం, మానసిక కుంగుబాటు, మాట్లాడినప్పుడు స్పందించకపోవడం, జనాల మధ్య ఉండడం ఇష్టపడకపోవడం వంటి లక్షణాలు ఉన్నాయి. ఆడటం, భాష అభివృద్ధిలో సమస్యలను ఎదుర్కోవడం మొదలైనవి ఆటిజం లక్షణాలుగా పరిగణిస్తారు. మీరు మీ పిల్లలలో అలాంటి లక్షణాలు కనిపిస్తే, ఖచ్చితంగా సరైన వైద్యుడిని సంప్రదించి అవసరమైనచికిత్స అందించాలి. ఆటిజం చికిత్సలో, బిహేవియర్ థెరపీతో పాటు ఇతర రకాల థెరపీలు ఇవ్వడం ద్వారా చికిత్స చేస్తారు.
ఇది కూడా చదవండి.. సీజనల్ ఇన్ఫెక్షన్స్ ను నియంత్రించాలంటే ఏమి చేయాలి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
