చిన్నపిల్లల్లో జలుబు సమస్యకు ఇంటిచిట్కాలు..!  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వాతావరణం మారే ప్రతిసారి జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. పెద్దవాళ్లు ఎలాగోలా తట్టుకున్నా, పిల్లలు మాత్రం తీవ్రంగా నీరసించి పోతారు. ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, గొంతు సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి ఇంటి చిట్కాలు ఎలా ఉపయోగపడుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 

-జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ హానికరం కాని సిరప్ లు వాడవచ్చు. 

-జలుబు పూర్తిగా తగ్గేవరకు రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిటపట్టించాలి.

-రోజుల్లో కనీసం మూడు సార్లయినా పసుపు లేదా, అదులో ఉంటే జండూబామ్‌లో వేసుకుని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు ఉపశమనం కలుగుతుంది.

-ఈ సీజన్‌లో నీళ్ల నుంచి అనేక జబ్బులు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దల దాకా అందరూ కాచి, చల్లార్చి వడపోసిన నీళ్లు మాత్రమే తాగితే మంచిది.

-జలుబు లక్షణాలను త్వరగా తగ్గించే వాటిలో ముఖ్యమైనది నిమ్మకాయ.. 

-గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

-మిరియాలు, వెల్లుల్లి, అల్లం ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి.

- పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఆరారాగా మంచినీరు తాగిస్తుండటం వల్ల కోల్పోయిన నీటి శాతం భర్తీ అయి శరీరానికి వ్యాధితో సమర్థంగా పోరాడగల శక్తి వస్తుంది.

- జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు ఆవనూనెకు వెల్లుల్లి కలిపి చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మసాజ్‌ చేయాలి.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.