సాక్షి లైఫ్ : మీరు బరువు తగ్గడానికి, యవ్వనంగా కనిపించడానికి లేదా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి పలు రకాల సప్లిమెంట్స్ కొంటున్నారా? అయితే జాగ్రత్త! మార్కెట్‌లో లభించే కొన్ని సప్లిమెంట్లు కేవలం మార్కెటింగ్ మాయలో భాగమే తప్ప, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ సప్లిమెంట్లు కేవలం డబ్బు వృధా మాత్రమేనని, వాటికి బదులుగా సరైన ఆహారంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అని వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. పిల్లల్లో ఈ 5 లక్షణాలు కనిపిస్తే విటమిన్-డి లోపమే..!
ఇది కూడా చదవండి.. లేట్ నైట్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎందుకు..?
ఇది కూడా చదవండి.. వంట నూనెకు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి లింక్ ఏంటి..?
కొల్లాజెన్ సప్లిమెంట్..
చాలామంది కొల్లాజెన్ సప్లిమెంట్లు తీసుకుంటే చర్మం బిగుతుగా, మెరిసేలా ఉంటుందని నమ్ముతారు. కానీ, నిజం ఏమిటంటే.. మీరు కొల్లాజెన్‌ను తీసుకున్నప్పుడు, అది మీ జీర్ణవ్యవస్థలో విచ్ఛిన్నమై కేవలం అమైనో ఆమ్లాలుగా మారుతుంది. ఇది నేరుగా మీ చర్మానికి చేరదు. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం, విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొల్లాజెన్ వల్ల కీళ్ల నొప్పులు, ఎముకల రక్షణకు కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అది చర్మ సౌందర్యాన్ని పెంచడంలో అంతగా పనిచేయదు.
ఫ్యాట్ బర్నర్స్..
మార్కెట్‌లో లభించే చాలా 'ఫ్యాట్ బర్నర్స్'లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మీకు తాత్కాలికంగా శక్తిని మాత్రమే ఇస్తాయి తప్ప, దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి ఏ మాత్రం సహాయపడవు. బరువు తగ్గడానికి సరైన మార్గం.. సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం. కేవలం క్యాప్సూల్స్‌తో బరువు తగ్గడం జరగకపోవచ్చు.
యాంటీ ఏజింగ్ సప్లిమెంట్స్..
NAD+, NMN, NR వంటి సప్లిమెంట్లు వృద్ధాప్యాన్ని నివారించే మ్యాజిక్ సప్లిమెంట్స్‌గా ప్రచారం పొందుతున్నాయి. జంతువులపై చేసిన పరిశోధనల్లో కొన్ని ప్రయోజనాలు కనిపించినప్పటికీ, మనుషులపై వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంది. అయినా కూడా కంపెనీలు వీటిని అధిక ధరలకు అమ్ముతున్నాయి. ఇప్పటి వరకు వీటి ప్రభావానికి సంబంధించి ఎలాంటి బలమైన ఆధారాలు లేవు.
డీటాక్స్ టీ, జ్యూస్ క్లెన్సెస్..
'డీటాక్స్' అనే పదం వినగానే చాలామంది శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు పోతాయని అనుకుంటారు. కానీ, వాస్తవానికి మన కాలేయం, కిడ్నీలు 24 గంటలు శరీరాన్ని శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉంటాయి. ఖరీదైన డీటాక్స్ టీ లేదా జ్యూస్‌లు మీ టాయిలెట్ విజిట్స్ పెంచుతాయి తప్ప, అంతకు మించి ఎలాంటి ప్రయోజనం ఉండదని డాక్టర్లు అంటున్నారు.
డిజైనర్ ప్రోబయోటిక్స్..
కొన్ని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. అయితే, బరువు తగ్గడం లేదా డీటాక్స్ లాంటి పెద్ద పెద్ద వాదనలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కొన్ని కంపెనీలు 500 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఖరీదైన ప్రోబయోటిక్స్ అమ్ముతున్నాయి. చాలా సందర్భాలలో, ఈ ప్రొడక్ట్స్ వెనుక మార్కెటింగ్ మాయాజాలం తప్ప సైన్స్ ఉండదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
సప్లిమెంట్స్ అవసరమా..అంటే?
మన శరీరానికి అవసరమైన పోషకాలు సమతుల్య ఆహారం నుంచే లభిస్తాయి. డాక్టర్లు సూచించిన సప్లిమెంట్లు మాత్రమే నిజంగా అవసరం. ఉదాహరణకు, భారతదేశంలో చాలామందిలో విటమిన్-డి, విటమిన్-బి12 లోపం సర్వసాధారణం. ఈ సందర్భంలో మాత్రమే వాటిని తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. సరైన ఆహారం, తగినంత నిద్ర, రోజూ వ్యాయామం చేయడం..ఈ మూడే అసలైన ఆరోగ్య రహస్యాలు అని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com