Simple Tips to Boost Creativity : పిల్లల్లో సృజనాత్మకత పెంచే చిట్కాలు ఇవిగో..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రతి బిడ్డ ప్రత్యేకమే.. వారి ఆసక్తులు కూడా విభిన్నంగానే ఉంటాయి. కొందరికి బొమ్మలు వేయడం ఇష్టం, మరికొందరికి పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, లేదా కథలు వినడం ఇష్టం. సృజనాత్మకత (creativity) అనేది కేవలం పుట్టుకతో వచ్చేది కాదు.. మనం కల్పించే వాతావరణం, ఇచ్చే ప్రోత్సాహం ద్వారా అది వృద్ధి చెందుతుంది. పిల్లల్లో సృజనాత్మకత పెరిగితే వారిలో ఆత్మవిశ్వాసం, కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి, సమస్యలను సులభంగా పరిష్కరించే నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ పిల్లల ఆలోచనా శక్తికి పదును పెట్టడానికి తల్లిదండ్రులుగా మీరు పాటించాల్సిన 5 ముఖ్యమైన చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందామా మరి..! 

 

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

1. స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి..

ప్రతిదానికీ నియమాలు పెట్టడం, పదేపదే నిలువరించడం పిల్లలకు విసుగు తెప్పిస్తుంది. వారు సొంతంగా ఆడుకునేందుకు, కొత్త విషయాలను అన్వేషించేందుకు తగినంత స్వేచ్ఛ ఇవ్వాలి. ఇలా వారు స్వేచ్ఛగా ఆడుకుంటున్నప్పుడు వారి ఊహాశక్తి (Imagination) అద్భుతంగా పనిచేస్తుంది. కొత్త విషయాలను సులభంగా, వేగంగా గ్రహించగలుగుతారు.

2. వారి ఆసక్తులను గుర్తించండి..

మీకు నచ్చిన రంగంలోనే వారు రాణించాలని మీ ఇష్టాలను పిల్లలపై రుద్దకండి. పెయింటింగ్, డ్యాన్స్, సంగీతం, ఆటలు.. ఇలా వారికి దేనిపై సహజమైన ఆసక్తి ఉందో గమనించండి. వారికి నచ్చిన రంగంలో ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తే, వారిలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది.

3. ఉత్సుకతకు ఓపికగా బదులివ్వండి..

పిల్లల బుర్రలో ఎన్నో సందేహాలు ఉంటాయి. వారు పదేపదే ప్రశ్నలు అడుగుతుంటే విసుక్కోకుండా, తిట్టకుండా ఓపిగ్గా బదులివ్వండి. వారిలోని ఉత్సుకతను (Curiosity) చంపేయకండి. కొత్త విషయాలను ప్రయత్నించేలా, చిన్నచిన్న ప్రయోగాలు చేసేలా వారిని ప్రోత్సహించండి. ఇది వారి ఆలోచనా పరిధిని మరింత విశాలం చేస్తుంది.

4. ప్రశంసలతో ప్రోత్సహించండి..

పిల్లలు ఒక చిన్న బొమ్మ గీసినా, విరిగిన వస్తువును అతికించినా, లేదా ఒక మంచి పని చేసినా వారిని మనస్ఫూర్తిగా అభినందించండి. మీరు చేసే చిన్న ప్రశంస వారిని మరింత మెరుగ్గా పనిచేసేలా, కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రేరేపిస్తుంది. వారి కష్టాన్ని గుర్తిస్తున్నారన్న భావన పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.

5. స్క్రీన్‌కి దూరం.. ఆటలకు దగ్గర..

టీవీలు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లతో గంటల తరబడి గడిపే సమయాన్ని తగ్గించండి. దానికి బదులుగా కథల పుస్తకాలు చదవడం, రంగులు వేయడం, పజిల్స్ సాల్వ్ చేయడం, బ్లాక్స్‌తో కొత్త ఆకారాలు నిర్మించడం, ఆరుబయట ఆటలు ఆడటం వంటి వ్యాపకాల వైపు మళ్లించండి. ఈ కార్యకలాపాలు వారి సృజనాత్మకతను రెట్టింపు చేస్తాయి.

సృజనాత్మకత ఎందుకు ముఖ్యం అంటే ..?

సృజనాత్మకత ఉన్న పిల్లలు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా విభిన్నంగా ఆలోచించగలరు. వీరికి సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు వారి చదువుతో పాటు, భవిష్యత్తులో కెరీర్‌ పరంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి ఎంతగానో తోడ్పడతాయి.

 

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు.. 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.