Thyroid Disorders in Infants : పసిపిల్లలకు 'థైరాయిడ్'.. సకాలంలో గుర్తించకపోతే మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం.. 

సాక్షి లైఫ్ : భారతదేశంలో నవజాత శిశువులను ఒక నిశ్శబ్ద మహమ్మారి వేధిస్తోంది. బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా, లోలోపల వారి మెదడు ఎదుగుదలను దెబ్బతీస్తూ.. భవిష్యత్తును అంధకారం చేస్తోంది. అదే 'కన్జెనిటల్ హైపోథైరాయిడిజం' (CH). దేశంలో పుట్టే ప్రతి 1,000 మంది శిశువులలో ఒకరు ఈ సమస్యతో జన్మిస్తున్నారని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే, ఇది శాశ్వత మేధోవైకల్యానికి (Intellectual Disability) దారితీసే ప్రమాదం ఉంది.

అసలేమిటీ సమస్య..?

శిశువు జన్మించినప్పుడు థైరాయిడ్ గ్రంథి పూర్తిగా లేకపోవడం లేదా అది సరిగ్గా అభివృద్ధి చెందకపోవడాన్ని 'కన్జెనిటల్ హైపోథైరాయిడిజం' అంటారు. మన శరీర మెటబాలిజం, పెరుగుదల మరియు ముఖ్యంగా మెదడు వికాసానికి అవసరమైన 'థైరాక్సిన్' (T4) అనే హార్మోన్‌ను ఈ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. శిశువు పుట్టిన మొదటి కొన్ని వారాలు మెదడులోని నాడుల అభివృద్ధికి ఈ హార్మోన్ అత్యంత కీలకం.

 

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 

కనిపించని ముప్పు.. కఠినమైన శిక్ష.. 

ఈ వ్యాధిలోని ప్రధాన ప్రమాదం ఏమిటంటే, పుట్టినప్పుడు శిశువులు అందరిలాగే మామూలుగా, ఆరోగ్యంగా కనిపిస్తారు. ఎటువంటి బాహ్య లక్షణాలు ఉండవు. కానీ లోపల థైరాక్సిన్ లోపం వల్ల మేధో వికాసం కుంటుపడటం.. మెదడు ఎదుగుదల ఆగిపోయి తెలివితేటలు తగ్గిపోతాయి. శారీరక ఎదుగుదల లోపం.. వయస్సుకి తగ్గ ఎత్తు, బరువు పెరగకపోవడం (Stunted Growth). వినికిడి లోపం, నడక, ఇతర శారీరక కదలికల్లో జాప్యం.

ఆ 'కీలక సమయం' దాటితే కష్టమే..!

మెదడు అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రక్రియ చాలా తక్కువ సమయంలోనే ముగుస్తుంది. ఆ 'గోల్డెన్ పీరియడ్'లో థైరాక్సిన్ అందకపోతే జరిగే నష్టం పూడ్చలేనిది. ఒకసారి మేధోవైకల్యం సంభవిస్తే, ఆ తర్వాత ఎన్ని మందులు వాడినా మెదడును పూర్వస్థితికి తీసుకురాలేము. అందుకే పుట్టిన వెంటనే చేసే 'నియోనేటల్ స్క్రీనింగ్' అంటే నవజాత శిశు పరీక్షలు ప్రాణావసరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

నివారణే మార్గం.. 

కేవలం ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చు. పుట్టిన 48 నుంచి 72 గంటల లోపు పాపాయి మడమ నుంచి కొన్ని చుక్కల రక్తం తీసి పరీక్షించడం ద్వారా థైరాయిడ్ లోపాన్ని పసిగట్టవచ్చు. ఒకవేళ లోపం ఉంటే, అతి తక్కువ ఖర్చుతో కూడిన హార్మోన్ ట్యాబ్లెట్ల ద్వారా ఆ బిడ్డను మేధోవైకల్యం నుంచి రక్షించి, సాధారణ పౌరుడిగా తీర్చిదిద్దవచ్చు.

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..  

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kids-health brain-health thyroid-problem thyroid-effect thyroid-problems
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com