మయోపియా లక్షణాలు ఎలా ఉంటాయి.. వాటిని ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : మయోపియా సమస్య పెరిగినప్పుడు, మీకు కంటిశుక్లం లేదా గ్లాకోమా వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యనిపుణులు హెచ్చరి స్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, టీవీలు ఎక్కువసేపు చూడడం ద్వారా కంటి పై తీవ్ర ప్రభావం పడుతుంది. స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం, తగినంత సహజ కాంతి లేకపోవడం, ఇది జన్యుపరమైన వ్యాధి. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, ఈ వ్యాధి వచ్చే ప్రమాదం మరింతగా పెరుగుతుంది.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
మయోపియా లక్షణాల ఎలా గుర్తించాలంటే..?
-కళ్ళ నుంచి నిరంతరం నీరు కారడం.
-తరచుగా కళ్ళు రెప్పవేయడం.
-సుదూర వస్తువులను చూడటానికి ఇబ్బంది పడడం.
-చూడటానికి కనురెప్పలు పెద్దగా తెరవాల్సిరావడం.
మయోపియా చికిత్స.. ఎలా అంటే..?
మయోపియా శస్త్రచికిత్స కాని చికిత్స కోసం అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తారు.
- దీని కోసం, అద్దాలలో అనేక రకాల లెన్స్‌లను కూడా ఉపయోగిస్తారు, వీటిలో బైఫోకల్స్, మల్టీఫోకల్ లెన్స్‌లు మొదలైనవి ఉన్నాయి.
- ఇది శస్త్రచికిత్స ద్వారా కూడా చికిత్స చేస్తారు, ఆ తర్వాత బాధితులు స్పష్టంగా చూడగలడు.
పిల్లలలో మయోపియాను ఎలా గుర్తించాలి..?
కళ్ళు రుద్దడం..
కళ్లలో ఒత్తిడి, అలసట ఉన్నప్పుడు కళ్లను రుద్దడం ఒక సాధారణ విషయం, కానీ కళ్లను రుద్దడం కూడా మయోపియా లక్షణంగా పరిగణిస్తారు. పిల్లలు తమ కళ్లను పదే పదే రుద్దుతుంటే, ఇది కంటి ఇన్ఫెక్షన్‌కు కూడా కారణం అవుతుంది. కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లల ఈ అలవాటుపై శ్రద్ధ పెట్టి వైద్యనిపుణులను సంప్రదించండి. పిల్లల కళ్ళలో నిరంతరం నీరు కారుతుంటే, అది మయోపియాకు సంకేతం కూడా కావచ్చు.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
