నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
సాక్షి లైఫ్ : జీర్ణకోశం బలంగా లేకపోతే నోటి దుర్వాసన అధికంగా వుంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నలుగురిలోకి వెళ్లాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నోట్లో దుర్వాసన రాకుండా ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
-కొబ్బరినికోరి మెత్తగా రుబ్బి పిండితే వచ్చే రసం . కొబ్బరిపాలు)లో తగినంత పచ్చకర్పూరం వేసుకొని పచ్చిగానే తాగవచ్చు. లేదా బాగా కాచి తాగవచ్చు. నోటి దుర్వాసన తగ్గుతుంది.
- గజనిమ్మకాయ నాలుగు భాగాలుగా చేసి చిన్నముక్కలుగా తరిగి, ఒక్కో ముక్కని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే నోరు శుభ్రపడ్తుంది. దుర్వాసన తగ్గుతుంది.
-జాజికాయ, జాపత్రీ, పచ్చ కర్పూరం కొద్దిగా తీసుకొని దంచి, ఎండుద్రాక్షలతోనూరి, చిన్న మాత్రలు కట్టి ఒక్క మాత్రని బుగ్గన పెట్టుకొని చప్పరించండి. నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది.
-దాల్చిన చెక్క బెరడు చిన్నముక్కను బుగ్గన ఉంచుకొని నములుతూ వుంటే నోరు శుభ్రంగా ఉంటుంది.
-తమలపాకులు నాలుకమీద జిగురును హరిస్తాయి. పచ్చకర్పూరం వేసిన కిళ్లీ తింటే నోటిలో మంచి సువాసన వస్తుంది.
-ఏలకులు, లవంగం కూడా నోటి దుర్వాసనని హరిస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు నోట్లో ఏలకులు గానీ, లవంగాలు గానీ వేసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.