Supplements : ఎలాంటి సప్లిమెంట్లు పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఈ మద్యకాలంలో చాలా ప్రకటనలు పిల్లల సప్లిమెంట్ల గురించివి  వస్తున్నాయి. వాణిజ్య ప్రకటనల ద్వారా కొన్ని పౌడర్ రూపంలో మరికొన్ని సిరప్ ల రూపంలో  వచ్చిన ఉత్పత్తులను ప్రచారం చేస్తాయి పలు కంపెనీలు. కానీ పిల్లలకు నిజంగా ఇలాంటి సప్లిమెంట్లు అవసరమా..? సరిగా తినని పిల్లలు లేదా ఆరోగ్యకరమైన ఆహారాలను ఇష్టపడని తల్లిదండ్రులకు ఈ ప్రశ్న మరింత ముఖ్యమైనది. పిల్లలకు సప్లిమెంట్లు ఇవ్వాలా..? లేదా ఆయా ఆహారం అవసరమైన పోషకాలను అందించగలదా..? వైద్యనిపుణులు ఏమంటున్నారు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..   

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

 

ఈ పోషకాలు పిల్లలకు చాలా అవసరం.. 

విటమిన్లు A, B, C, D, E, అండ్ K వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పిల్లలకు చాలా అవసరం. అదనంగా, ఆరోగ్యకరమైన అభివృద్ధికి వారికి ఫోలేట్, కాల్షియం, అయోడిన్, ఇనుము, జింక్ కూడా కావాలి. ఈ పోషకాలు పిల్లల మెదడు, నరాల అభివృద్ధి, కంటి చూపు, ఎముకల బలం, రోగనిరోధక శక్తి, జీవక్రియ, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఆరోగ్యకరమైన పిల్లలు ఈ పోషకాలన్నింటినీ సప్లిమెంట్ల నుంచి కాకుండా ఆహారం ద్వారానే  పొందాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.

పరిశోధన ఏం చెబుతోంది..? సప్లిమెంట్ల నుంచి కాకుండా ఆహారం ద్వారా మాత్రమే విటమిన్లు , ఖనిజాలను పొందడం మంచిదని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన పరిశోధన వెల్లడిస్తోంది. అవసరమైన పోషకాలను అందించడంతో పాటు, పిల్లలకు ఫైబర్, ఎంజైమ్‌లు , సప్లిమెంట్లు ఇవ్వలేని ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా ఆహారం అందిస్తుంది. విటమిన్లు A, C, లేదా D అధిక మోతాదులో పిల్లలపై విషపూరిత ప్రభావాలను చూపుతున్నట్లు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చెబుతోంది.

తల్లిదండ్రులు ఈ లోపాన్ని ఎలా పరిష్కరించవచ్చు..? 

 కొందరు పిల్లలు న్యూట్రిషన్ వ్యాల్యూస్ ఉన్న ఫుడ్ ను పెద్దగా ఇష్టపడకపోవచ్చు. అప్పుడు వాళ్లు బాగా ఇష్టంగా తినే పండ్లు, కూరగాయల రూపంలోనే అందించాలి. ఉదాహరణకు, ఒక పిల్లవాడు బంగాళాదుంపలను మాత్రమే తింటుంటే, మీరు క్యాబేజీ లేదా అలాంటి రుచి, రంగు కలిగిన కూరగాయలను కలిపి తినిపించాలి. అనారోగ్యకరమైన పదార్థాలను ఆరోగ్యకరమైన, రుచికరమైన పదార్థాల ప్లేస్ లో భర్తీ చేయాలి. ఉదాహరణకు, ఫాస్ట్ ఫుడ్స్ , పాస్తా, బియ్యం స్థానంలో తృణధాన్యాలను యాడ్ చేయాలి. అలా చిన్నారులకు కావాల్సిన పోషకాహారాన్ని అందించవచ్చు.. 

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.