సాక్షి లైఫ్ : బరువు తగ్గడానికి ఉపవాసం (Fasting) చేయడం అనేది ఇప్పుడు కొత్తేమీ కాదు. అయితే, గంటల తరబడి ఏమీ తినకుండా ఉండడం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారి కోసం, ఉపవాసం చేసినా... ఆహారాన్ని తీసుకునే వెసులుబాటు కల్పించే ఒక వినూత్నమైన ఆహార ప్రణాళిక (Diet Plan) ఇప్పుడు ఆరోగ్య ప్రపంచంలో చర్చగా మారుతోంది. అదే 'ఫేక్ ఫాస్టింగ్' (Fake Fasting) లేదా 'ఫాస్టింగ్ మిమికింగ్ డైట్' (Fasting Mimicking Diet - FMD). ఈ డైట్‌లో ఉపవాసం ఆరోగ్య ప్రయోజనాలను పొందుతూనే, వయస్సును వెనక్కి తిప్పే (Age-Reversing) లాంటి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..Track Diabetes Smartly : డయాబెటీస్ ను స్మార్ట్‌గా ట్రాక్ చేయండి.. ఆరోగ్యంగా జీవించండి..!
ఫేక్ ఫాస్టింగ్ అంటే ఏమిటి..?
అయితే ఇది పూర్తిగా ఆహారాన్ని మానడం కాదు. బదులుగా, ఉపవాసం జీవక్రియ ప్రభావాన్ని (Metabolic Effects) శరీరంలో సృష్టించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఆహార ప్రణాళిక ఇది.
ఈ డైట్ సాధారణంగా 5 రోజులు ఉంటుంది. ఈ 5 రోజుల్లో చాలా తక్కువ కేలరీలు, తక్కువ ప్రోటీన్ (Protein), తక్కువ కార్బోహైడ్రేట్లు (Carbohydrates)అధిక ఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy Fats) ఉన్న శాకాహార (Plant-based) ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా తక్కువ కేలరీలను అందించడం వలన, మన శరీరం 'ఉపవాస స్థితి' (Fasting State) లోకి వెళ్లిందని భ్రమ పడుతుంది (Tricks the Body). అప్పుడు, ఇది శక్తి కోసం ఫ్యాట్‌ను బర్న్ చేయడం (Burn Fat) అటోఫాగి (Autophagy) అనే కణ పునరుజ్జీవన ప్రక్రియను (Cellular Rejuvenation Process) ప్రారంభిస్తుంది.
ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలున్నాయి..?
ఈ ఫేక్ ఫాస్టింగ్ ప్లాన్ అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కేలరీల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల, శరీరం నిల్వ ఉన్న కొవ్వును (Stored Fat) కరిగించి వేగంగా బరువు తగ్గుతారు.
'ఫేక్ ఫాస్టింగ్' (Fake Fasting) లేదా 'ఫాస్టింగ్ మిమికింగ్ డైట్' (Fasting Mimicking Diet - FMD). వల్ల శరీరంలో అటోఫాగి అనే ప్రక్రియ జరుగుతుంది. ఇందులో, పాత, దెబ్బతిన్న కణాలను (Damaged Cells) శరీరం తొలగించి, వాటి స్థానంలో కొత్త ఆరోగ్యకరమైన కణాలను తయారు చేస్తుంది. దీని ద్వారా, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడి, జీవ సంబంధ వయస్సు (Biological Age) తగ్గినట్లు అధ్యయనాలు సూచించాయి.
అంతేకాదు ఇది రక్తంలో చక్కెర (Blood Sugar) స్థాయిలను, కొలెస్ట్రాల్‌ను (Cholesterol) నియంత్రించి, హృదయ సంబంధ వ్యాధుల (Cardiovascular Diseases) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పూర్తి ఉపవాసంతో పోలిస్తే, ఇందులో కొంత ఆహారం తీసుకునే అవకాశం ఉండడం వలన, దీన్ని పాటించడం చాలా సులభం. ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.
డైట్‌లో ఏముంటుంది మరి..?
'ఫాస్టింగ్ మిమికింగ్ డైట్' (FMD) ప్లాన్‌లో సాధారణంగా సూప్స్, ఎనర్జీ బార్స్, నట్స్, టీలు వంటి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఉంటాయి. కేలరీలను కచ్చితంగా కొలిచి నిర్ణీత పరిమాణంలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కొత్త డైట్ ప్లాన్ అయినా ప్రారంభించే ముందు, ముఖ్యంగా మీకు డయాబెటిస్ లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే, తప్పనిసరిగా వైద్యనిపుణులు లేదా డైటీషియన్ల సలహాలు తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com