Autism : ఆటిజం లక్షణాల్లో ఎలాంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలి..? 

సాక్షి లైఫ్ : ఆటిజం ఉంటే..పేరు పిలిస్తే వెంటనే స్పందించలేరా..? వయసుకు తగినట్టుగా మాటలు వస్తున్నాయా? లేక ఆలస్యం ఉందా? ఒకే మాటలు లేదా శబ్దాలను పదే పదే పలుకుతున్నాడా? ఇతర పిల్లలతో ఆడటానికి ఆసక్తి చూపిస్తున్నాడా? ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నాడా? ఆనందం, బాధ, భయం వంటి భావాలను స్పష్టంగా వ్యక్తపరుస్తున్నాడా? చిన్న మార్పులకే తీవ్ర అసహనం లేదా కోపం చూపిస్తున్నాడా?

 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

చేతులు ఊపడం, ఊగడం, తిరగడం వంటి పునరావృత ప్రవర్తన కనిపిస్తున్నదా? పిల్లవాడు మాట్లాడేటప్పుడు ఎదుటివారి కళ్లలోకి చూస్తున్నాడా? పిల్లవాడు ఇతర పిల్లలను చూసి అనుకరించే ప్రయత్నం చేస్తున్నాడా? ఆటల్లో ఊహాశక్తి (imagination) కనిపిస్తున్నదా? లేక ఒకే విధంగా ఆడుతున్నాడా? బొమ్మలను ఆడించకుండా వరుసగా అమర్చడం, తిప్పడం మాత్రమే చేస్తున్నాడా? కొత్త వ్యక్తులు ఎదురైతే భయపడుతున్నాడా లేదా స్పందించడంలో ఇబ్బంది పడుతున్నాడా? ఇవన్నీ ఆటిజం ఉన్నప్పుడు కనిపించే సంకేతాలేనా..? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిషన్ డా. హేమ నళిని సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : autism autism-children autism-kids signs-of-autism-in-toddlers what-is-autism signs-of-autism-in-infants signs-of-autism-in-boys first-autism-diagnosis mild-autism
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com