World Obesity Atlas 2026 Report : బాల్యంపై 'బరువు' భారం..: ఊబకాయంలో భారత్ రెండో స్థానం.. వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2026 నివేదిక..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో ఊబకాయం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా చైనా తర్వాత భారత్‌లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో 5 నుంచి 19 ఏళ్ల వయస్సు గల దాదాపు 1.5 కోట్ల మంది పిల్లలు ఊబకాయం (Obesity) సమస్యతో బాధపడుతుంటే, మరో 2.6 కోట్ల మంది అధిక బరువుతో (Overweight) ఉన్నట్లు తాజా వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2026 నివేదిక వెల్లడించింది. గ్లోబల్ టార్గెట్లను చేరుకోవడంలో ప్రపంచ దేశాలు వెనుకబడి ఉన్నాయని, భారత్ కూడా దీనికి మినహాయింపు కాదని హెచ్చరిస్తోంది.

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గణాంకాలు..? 

 భారత్‌లో 10 నుంచి 19 ఏళ్ల వయస్సు గల సుమారు 2.6 కోట్ల మంది పిల్లలు అధిక బరువుతో ఉన్నారు. 2040 నాటికి ఊబకాయం కారణంగా హైపర్‌టెన్షన్, హైపర్ గ్లైసీమియా , కాలేయ సంబంధిత వ్యాధులు (MASLD) భారీగా పెరిగే అవకాశం ఉంది. వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ అలవాట్లు, చక్కెర కలిగిన పానీయాలు అధికంగా తీసుకోవడం, శిశువులకు సరైన తల్లిపాలు అందకపోవడం ప్రధాన కారణాలుగా గుర్తించారు. పిల్లల్లో ఈ ధోరణిని మార్చడానికి చక్కెర పానీయాలపై పన్నులు విధించడం, ఆహార ప్రకటనలపై నియంత్రణ, ప్రభుత్వాల తక్షణ కార్యాచరణ అవసరమని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ సూచించింది.

 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.