Failure Phobia : ఫెయిల్యూర్ ఫోబియా తోనే మోసం : మానసిక నిపుణులు.. 

సాక్షి లైఫ్ : పరీక్షల్లో, కార్యాలయాల్లో జరిగే మోసాలను సాధారణంగా నీతి నియమాలు లేకపోవడం వల్ల జరిగే పరిణామాలుగా పరిగణిస్తారు. కానీ దీని వెనుక లోతైన మానసిక పోరాటం దాగి ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంచనాలు, ఒత్తిడి, వైఫల్య భయం (Fear of Failure) పరాకాష్టకు చేరినప్పుడు కొంతమంది వ్యక్తులు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని వారు అంటున్నారు.

 ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 

షేమ్ లూప్ (Shame Loop).. 

ఈ ప్రవర్తనను వివరించే ఒక ముఖ్యమైన మానసిక విధానం 'షేమ్ లూప్' (Shame Loop). షేమ్ లూప్ అనేది ప్రతికూల భావోద్వేగ, అభిజ్ఞా చక్రం, ఇది సిగ్గు, స్వీయ నిందల భావాలను ప్రేరేపిస్తుంది.  

భయం (Fear): వైఫల్యం తప్పదనే తీవ్ర భయం మొదలవుతుంది.

మోసం (Cheating): ఆ భయం నుంచి తక్షణ ఉపశమనం కోసం మోసం అనే అడ్డదారిని ఎంచుకుంటారు.

సిగ్గు (Shame): తాత్కాలిక ఉపశమనం తర్వాత అపరాధ భావన, పశ్చాత్తాపం, సిగ్గు ఆవరిస్తాయి.

మళ్లీ భయం: ఈ సిగ్గు మరింతగా వైఫల్య భయాన్ని పెంచుతుంది. దీంతో మళ్లీ మోసపూరిత ఎంపికల వైపు మొగ్గు చూపుతారు.

  సిగ్గు (Shame) vs. అపరాధ భావం (Guilt).. 

ఈ వలయంలో 'సిగ్గు' కీలక పాత్ర పోషిస్తుంది. అపరాధ భావం "నేను తప్పు చేశాను" అని చెబితే, సిగ్గు మాత్రం వ్యక్తి గుర్తింపునే ప్రశ్నిస్తుంది. దీంతో వారు తమ తప్పులను ఎదుర్కోకుండా, ఆ అసౌకర్యాన్ని తప్పించుకోవడానికి పదేపదే మోసాలకు పాల్పడతారు.

  ఈ వలయాన్ని ఎలా బ్రేక్ చేయాలి..?'

ఈ 'షేమ్ లూప్' నుంచి బయటపడాలంటే, వైఫల్యాన్ని చూసే విధానాన్ని మార్చుకోవాలి.

గ్రోత్ మైండ్‌సెట్ (Growth Mindset): తప్పులను నేర్చుకోవడానికి సోపానాలుగా భావించాలి. సవాళ్లను ధైర్యంగా స్వీకరించాలి.

స్వీయ కరుణ (Self-Compassion): తమను తాము కఠినంగా విమర్శించుకునే బదులు, దయగా, సానుభూతితో తమ తప్పులను తెలుసుకోగలగాలి, అలాంటి తప్పిదాలు మళ్లీ మళ్లీ జరగకుండా చూసుకోవాలి. తమ భయాలను విశ్వసనీయ వ్యక్తులతో లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో పంచుకోవడం ద్వారా ఆయా సమస్య నుంచి బయట పడొచ్చు.

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health tensions stress stress-mind researchers office-work psychologists mental-stress psychologist positive-mindset phobia phobia-facts growth-mindset fixed-mindset employee-well-being failure-phobia fear-of-failure
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com