మూర్ఛ వ్యాధికి కారణాలేమిటి? లక్షణాలు..? చికిత్స..? 

సాక్షి లైఫ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్లమంది మూర్ఛ రోగులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఉండడం గమనార్హం. భారతదేశంలో దాదాపు కోటి మంది మూర్ఛకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.

మూర్ఛవ్యాధిని ఇంగీష్ లో "ఎపిలెప్సీ" అంటారు. మూర్ఛలను "ఫిట్స్" అని కూడా అంటారు. మూర్చలలో రెండు రకాలున్నాయి. ఒకటి మామూలు స్థితిలో ఉన్నప్పుడు వచ్చే మూర్ఛలు , రెండవది నిద్రలో ఉన్నప్పుడు వచ్చేవి . ఇవి రెండూ మెదడుపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. ఫోకల్, లేదా పాక్షిక మూర్ఛలు మెదడులోని ఒక భాగాన్ని మాత్రమే ప్రభావితం చేస్తాయి.

మూర్ఛలు ఎందుకు వస్తాయి..?  

న్యూరాన్లలోని ఆకస్మిక, అనియంత్రిత విద్యుత్ ప్రవాహాలు మూర్ఛలకు కారణమవుతాయి. ప్రతి వయస్సులో వివిధ సమస్యలు, ఆందోళనలు ఉంటాయి. ఈ పరిస్థితి ఎవరినైనా ఎప్పుడైనా ప్రభావితం చేయవచ్చు.   

మూర్ఛ లక్షణాలు..? 
 
 తదేకంగా చూస్తూ ఉండిపోవడం.. 

శరీరం గట్టిపడటం.. 

స్పృహ కోల్పోవడం..

శ్వాస సమస్యలు.. 

ప్రేగు లేదా మూత్రాశయం నియంత్రణ కోల్పోవడం.. 

స్పష్టమైన కారణం లేకుండా అకస్మాత్తుగా పడిపోవడం.. 

ముఖ్యంగా స్పృహ కోల్పోవడం

చేతులు లేదా కాళ్ళలో జలదరింపు అనిపించడం.. 

కొన్నిసార్లు మూర్ఛపోయినప్పుడు ఏమి జరిగిందో గుర్తుంచుకోలేరు..

మూర్ఛకు కారణాలు.. 

న్యూరో ట్రాన్స్మిటర్లు, కణితులు, స్ట్రోక్ , మెదడు దెబ్బతినడం, నరాల-సిగ్నలింగ్ రసాయనాల అసమతుల్యతతో సహా మూర్ఛకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మూర్ఛ వ్యాధికి గుర్తించదగిన కారణాలు ఉండకపోవచ్చు.

మూర్ఛకు చికిత్స.. 

యాంటీ-ఎపిలెప్టిక్ డ్రగ్స్ అని పిలిచే మందులు.

మూర్ఛలకు కారణమయ్యే మెదడులోని చిన్న భాగాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స.

మూర్ఛలను నియంత్రించడంలో సహాయపడే ఒక చిన్న విద్యుత్ పరికరాన్ని శరీరం లోపల ఉంచే ప్రక్రియ.

మూర్ఛలను నియంత్రించడంలో సహాయపడే ప్రత్యేక ఆహారం 

ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు సరైన జీవనశైలి అవసరం.

కొంతమందికి జీవితకాల చికిత్స అవసరం కావచ్చు, మూర్ఛలు కాలక్రమేణా తగ్గితే చికిత్సను ఆపివేయవచ్చు.


గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : epilepsy
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com