హెచ్ డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంటే మంచిది..?

షేర్ చేయండి:
హెచ్ డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంటే మంచిది..?

సాక్షి లైఫ్ : హై డెన్సిటీ లిపోప్రోటీన్ (హెచ్ డిఎల్) కొలెస్ట్రాల్‌ను గుడ్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఎందుకంటే దీని సరైన స్థాయి హృదయ రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 40 నుంచి 80 mg/dL స్థాయి పురుషుల్లో సాధారణం, మహిళల్లో 50 నుంచి 80 mg/dL ఉండాలి. దీనిని రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..? 

ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే

హెచ్ డిఎల్ అంటే ఏమిటి..?

హెచ్ డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్ (High-Density Lipoprotein). లిపోప్రోటీన్ అనేది లిపిడ్స్ మరియు ప్రోటీన్‌లతో తయారైన చిన్న అంశాలు, ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను శరీరంలోని వివిధ భాగాలకు తీసుకెళ్లే పని చేస్తాయి. హెచ్ డిఎల్ అనేది అదనంగా ఉన్న కొలెస్ట్రాల్‌ను రక్తం నుంచి తీసి కాలేయం వరకు తీసుకెళ్లి, అక్కడ దానిని విచ్ఛిన్నం చేసి మలం ద్వారా బయటకు పంపుతుంది.

 ఎందుకు గుడ్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు?

హెచ్ డిఎల్ గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఇది రక్తంలో అదనంగా ఉన్న కొలెస్ట్రాల్‌ను తొలగించే పని చేస్తుంది. అలాగే ఇది ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. రక్తం గడ్డలు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది.


గుడ్ కొలెస్ట్రాల్ సాధారణ, అసాధారణ స్థాయిలు..

పురుషుల్లో హెచ్ డిఎల్ : 40 mg/dL కంటే తక్కువ
మహిళల్లో హెచ్ డిఎల్ : 50 mg/dL కంటే తక్కువ
సాధారణ హెచ్ డిఎల్ : పురుషులు - 40 నుంచి 80 mg/dL, మహిళలు - 50 నుంచి 80 mg/dL
ఎక్కువ హెచ్ డిఎల్ (ఎవరిలోనైనా): 80 mg/dL కంటే ఎక్కువగా ఉంటే నార్మల్ కంటే ఎక్కువగా భావిస్తారు.  

ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.