బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిందని తెలిపే సంకేతాలివే..
సాక్షి లైఫ్ : మన శరీరంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. దినచర్య, ఆహారపు అలవాట్లపై గుడ్ కొలెస్ట్రాల్ , బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుదల అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్..
శరీరంలో ఉత్పత్తి అయ్యే కొలెస్ట్రాల్ మైనపు లాంటి జిగట పదార్థం. పరిమిత పరిమాణంలో శరీరంలో దీని ఉనికి ఏ సమస్యకు కారణం కాదు, కానీ రక్తంలో దాని అదనపు పరిమాణం క్రమంగా రక్తనాళాల్లో చేరడం ప్రారంభమవుతుంది. ఇది గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. దీని లక్షణాలు ప్రారంభ దశలో గుర్తించలేము.
కొన్నిసార్లు దీనిని గుర్తించడానికి నెలలు ,సంవత్సరాలు కూడా పడుతుంది. శరీరంలోని కొన్ని భాగాలలో నొప్పి ఉన్నప్పుడు ఈ సమస్యను గుర్తించవచ్చు. చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు సంకేతంగా నొప్పిగా భావించే ఆ భాగాలు తెలుసుకోండి.
చెడు కొలెస్ట్రాల్ సైడ్ ఎఫెక్ట్స్..
గుండె జబ్బులే కాకుండా, పెరిగిన కొలెస్ట్రాల్ శరీరంలోని ఇతర భాగాలకు కూడా హాని కలిగిస్తుంది.
-చర్మంపై దద్దుర్లు
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మీ చర్మంపై దద్దుర్లు కనిపించడం ప్రారంభిస్తాయి. చేతులు, కాళ్లు మరియు వీపు మొదలైన వాటిపై దద్దుర్లు కనిపిస్తాయి.
-కళ్ళు కింద ఉబ్బినట్లు గా అనిపించడం..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, కళ్ల కింద ఉబ్బడం మొదలవుతుంది. ముఖం వాచినట్లు కనిపిస్తుంది. ఇది కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది.
-చేతులు-కాళ్ళు తిమ్మిరి..
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చేతులు, కాళ్లు మొద్దుబారుతుంటాయి.
ఈ మూడు ప్రదేశాల్లో నొప్పి చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతం
అధిక కొలెస్ట్రాల్
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, దాని లక్షణాలు సులభంగా కనిపించవు. కానీ అది అధికంగా పెరిగినప్పుడు, శరీరంలోని మూడు ప్రధాన భాగాలలో నొప్పి మొదలవుతుంది. అందులో మొదటిది, తొడలలో తీవ్రమైన నొప్పి, రెండవది తుంటిలో, మూడవది కాళ్ళలో అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నపుడు నొప్పిగా అనిపిస్తాయి.
ఈ మూడు ప్రదేశాలలో మీకు నొప్పి ఉంటే, ముందుగా మీ కొలెస్ట్రాల్‌ని చెక్ చేసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన శరీరంలో 200 mg/dl కొలెస్ట్రాల్ ఉండటం సాధారణమైనదిగా పరిగణిస్తారు. అయితే అది 240 mg/dl దాటితే ప్రమాద స్థాయి కొలెస్ట్రాల్ గా భావిస్తారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
