Breast cancer : రొమ్ము క్యాన్సర్ బాధితుల ఆయువు పెంచే ఔషధానికి ఆమోదం..!
సాక్షి లైఫ్ : మహిళలను తీవ్ర భయాందోళనలకు గురిచేసే ప్రాణాంతక వ్యాధుల్లో రొమ్ము క్యాన్సర్ (Breast cancer) ప్రధానమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 6.94 లక్షల మంది, భారత్‌లో 80 వేలకు పైగా మహిళలు ఈ వ్యాధితో మరణిస్తున్నారు. అయితే, వైద్యరంగంలో వస్తున్న సరికొత్త పరిశోధనలు క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. తాజాగా అత్యంత సంక్లిష్టమైన రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్న బాధితులకు ఊరటనిచ్చేలా బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవ (National Health Service) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బాధితుల ఆయుష్షును పెంచే 'ఎన్‌హెర్టు' (Enhertu) ఔషధ వినియోగానికి ఎట్టకేలకు అధికారిక ఆమోదం లభించింది.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఆయువును పెంచే ‘ఎన్‌హెర్టు’..
రొమ్ము క్యాన్సర్ చివరి దశకు చేరుకుని, ఇతర శరీర భాగాలకు వ్యాపించిన (metastatic cancer) రోగులకు చికిత్స అందించడం వైద్యులకు పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా ‘హెచ్ఈఆర్2-లో’ (HER2-low) రకం క్యాన్సర్ కణాలను నియంత్రించడం మరింత క్లిష్టంగా ఉంటుంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులకు 'ఎన్‌హెర్టు'...సాంకేతిక నామం.. ట్రాస్టుజుమాబ్ డెరక్స్‌టెకాన్.. సంజీవనిలా పనిచేస్తుందని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ (ASCO) సమావేశంలో వెల్లడైన పరిశోధనల ప్రకారం.. ఈ ఔషధం ద్వారా బాధితుల జీవితకాలాన్ని సగటున 7 నెలల నుంచి కొందరిలో గరిష్ఠంగా మూడేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఈ మందును ప్రతి మూడు వారాలకు ఒకసారి నరాల ద్వారా రోగి శరీరంలోకి నెమ్మదిగా పంపుతారు.
ఏళ్ల తరబడి పోరాటం తర్వాతే గ్రీన్ సిగ్నల్..
యూరప్‌లోని దాదాపు 26 దేశాలతో పాటు స్కాట్లాండ్‌లో 2023 నుంచే అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంగ్లాండ్‌లో ఈ ఔషధానికి ఆమోదం లభించడానికి తీవ్ర జాప్యం జరిగింది. అత్యంత ఖరీదైన ఔషధం కావడం అంటే నెలకు సుమారు రూ.12.8 లక్షల పైమాటే వల్ల తొలుత నిబంధనల పరంగా అనుమతులు రాలేదు. దీంతో క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థలు, బాధితులు ఏళ్ల తరబడి పోరాడాల్సి వచ్చింది.
ఎట్టకేలకు బ్రిటన్ ఆరోగ్య విభాగం దీనికి అనుమతినివ్వడంతో దాదాపు వెయ్యి మంది బాధితులకు ప్రభుత్వ ఆరోగ్య సేవల్లో భాగంగా ఈ చికిత్స అందనుంది. ఖరీదైనప్పటికీ, నయంకాని స్థితిలో ఉన్న క్యాన్సర్ బాధితులకు మరింత కాలం జీవించేందుకు, కుటుంబంతో గడిపేందుకు ఈ ఔషధం అమూల్యమైన అవకాశాన్ని కల్పిస్తుందని ఆంకాలజీ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
