మానసిక ఆరోగ్యంపై వాతావరణ కాలుష్య ప్రభావం?
సాక్షి లైఫ్ : వాయు కాలుష్యం కారణంగా శారీరక ఆరోగ్యమేకాదు. మానసిక ఆరోగ్యం సైతం దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. పొల్యూషన్ ఎఫెక్ట్ నిద్రపై కూడా ఉంటుంది. ఇది కాస్తా మన జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా.. మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
పచ్చదనం తగ్గడంతో..
పచ్చదనం తగ్గడంతోపాటు వాహనాల కాలుష్యం పెరగడంతో ఇప్పటికే ఢిల్లీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా పెరుగుతున్న వాయు కాలుష్యం మానసిక ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అధ్యయనంలో..ఏం తేలిందంటే..?
అమెరికాలోని వర్జీనియాలో ఉన్న అమెరికన్ ఇన్‌గ్రేడ్ ఫర్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గాలిలో పార్టిక్యులర్ మీటర్ (పీఎం) 2.5 శాతం పెరిగితే మానసిక ఆరోగ్యానికి ప్రమాదం10.3 శాతం పెరుగుతుందని తేల్చారు.
పీఎం 2.5 గాలిలో ఒక శాతం పెరిగితే, ఈ గాలిని ఎక్కువసేపు పీల్చుకుంటే, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని అమెరికాలోని వర్జీనియాలోని అమెరికన్ ఇన్‌ఫర్మేషన్ ఫర్ రీసెర్చ్ పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు.
పీఎం 2.5 గాలిలో ఒక క్యూబిక్ మీటరుకు ఒక మైక్రోగ్రామ్ పెరిగితే, డిప్రెషన్ గురయ్యే అవకాశాలు 1.49 శాతం పెరుగుతాయని రీసెర్చ్‌లో తేలింది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
