Body Detox : బాడీని ఇలా బాడీ డిటాక్స్ చేస్తే .. ఎలాంటి వ్యాధులు దరిచేరవు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వాతావరణం మారినప్పుడల్లా జలుబు, దగ్గు, నీరసం, జీర్ణ సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు వేధిస్తుంటాయా? ఇలాంటప్పుడు శరీర రోగనిరోధక శక్తిని (immune system) బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో పేరుకుపోయిన మలినాలను, విషతుల్యాలను (toxins) ఎప్పటికప్పుడు బయటకు పంపడం (detoxification) ద్వారా పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సహజంగానే మన శరీరానికి వ్యర్థాలను బయటకు పంపే వ్యవస్థ ఉంటుంది. కానీ, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, చెడు జీవనశైలి కారణంగా ఆ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అయితే, మన దినచర్యలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా శరీరాన్ని సహజంగానే డిటాక్స్ చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం..

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

బాడీ డిటాక్స్‌కు తోడ్పడే 6 అలవాట్లు..

ఉదయాన్నే గోరువెచ్చని నీరు..

 నిద్ర లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తుంది. వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

తాజా పండ్లు, ఆకుకూరలు..

 పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మనల్ని రక్షిస్తాయి. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి.

తగినన్ని నీళ్లు తాగాలి..

 రోజంతా తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి అత్యవసరం. నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగై, శరీరంలోని అనవసర వ్యర్థాలు మూత్రం ద్వారా సులభంగా బయటకు వెళ్లిపోతాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం..

 రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా, చెమట రూపంలో చర్మం గుండా మలినాలు బయటకు పోయి శరీరం ఉల్లాసంగా మారుతుంది.

జంక్ ఫుడ్‌కు దూరం..

నూనెలో వేయించిన పదార్థాలు, తీపి ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి జీర్ణవ్యవస్థపై అదనపు భారం మోపుతాయి. దానికి బదులుగా ఇంట్లో వండిన తాజా, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.

కంటినిండా నిద్ర..

రాత్రి వేళ కనీసం 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్రలో ఉన్నప్పుడే శరీరం తనను తాను మరమ్మతు చేసుకుని (repair), ఎనర్జీని కూడగట్టుకుంటుంది. మంచి నిద్ర ఇమ్యూనిటీని పెంచడానికి ఎంతో కీలకం.

వాతావరణ మార్పుల్లో ఇవి ఎందుకు ముఖ్యం..?

రుతువులు మారుతున్న సమయంలో వైరస్, బ్యాక్టీరియాలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. శరీరానికి తగినంత పోషణ, విశ్రాంతి, హైడ్రేషన్ అందినప్పుడు మాత్రమే వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటుంది. కాబట్టి, ఈ ఆరోగ్యకరమైన అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకుంటే ఎలాంటి వాతావరణంలోనైనా జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు.

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.