Dental Scaling : డెంటల్ స్కేలింగ్ అంటే ఏమిటి..? అపోహలు - వాస్తవాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పళ్లు శుభ్రం చేయించుకోవాలని దంత వైద్యులు తరచుగా సూచిస్తుంటారు. కానీ, అలా డెంటల్ స్కేలింగ్ చేయిస్తే పళ్లు బలహీనపడతాయని, వాటి మధ్య సందులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. అందుకే, అవసరమున్నా డెంటిస్ట్ దగ్గరికి వెళ్లడానికి జంకుతారు. వాస్తవానికి వైద్యుల ప్రకారం స్కేలింగ్ అనేది దంతాలకు ఎంతో మేలు చేసే అత్యంత సురక్షితమైన ప్రక్రియ. దీనిపై ఉన్న అపోహలు, వాస్తవాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

అసలేంటి ఈ డెంటల్ స్కేలింగ్..?

మనం రోజూ బ్రష్ చేసినప్పటికీ దంతాల సందుల్లో, చిగుళ్ల వద్ద కొంత మురికి పేరుకుపోయి గార (tartar), ప్లాక్‌గా మారుతుంది. దీనిని ప్రత్యేకమైన డెంటల్ పరికరాలతో వైద్యులు శుభ్రం చేసే ప్రక్రియనే 'స్కేలింగ్' అంటారు. దంతాలు, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాలానుగుణంగా ఈ క్లీనింగ్ చేయించుకోవడం చాలా అవసరం.

అపోహలు - వాస్తవాలు..

 పళ్లు శుభ్రం చేయడం వల్ల ఏమాత్రం బలహీనపడవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దంతాలపై గార ఒక గట్టి పొరలా ఉంటుంది. దాన్ని తొలగించినప్పుడు పళ్లు కాస్త పలచబడినట్లు అనిపిస్తుంది. అది కేవలం మురికి పోవడం వల్ల కలిగే భావన మాత్రమే.

2. క్లీనింగ్ తర్వాత సెన్సిటివిటీ వస్తుందా..?

 ఏళ్ల తరబడి ఉన్న గారను తొలగించినప్పుడు దంతాల అసలు ఉపరితలం (Enamel) బయటపడుతుంది. కాబట్టి, వేడి లేదా చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు కొద్దిరోజుల పాటు పళ్లు జివ్వుమని లాగుతాయి. ఇది చాలా సాధారణం. కొద్దిరోజుల్లో ఈ సమస్య దానంతటదే తగ్గిపోతుంది.

3. పళ్ల మధ్య సందులు వస్తాయా..?

వాస్తవం..ఇది పూర్తిగా అపోహ మాత్రమే. దంతాల మధ్య సహజంగా ఉండే సందులను గార కప్పేస్తుంది. స్కేలింగ్ ద్వారా ఆ మురికిని తొలగించినప్పుడు పళ్ల మధ్య ముందే ఉన్న సందులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకానీ, క్లీనింగ్ వల్ల కొత్తగా ఎలాంటి సందులు ఏర్పడవు.

దంతాల శుభ్రత ఎందుకు అవసరం..? ఉపయోగాలు ఏంటి..?


చిగుళ్ల వ్యాధులకు చెక్.. దంతాలను శుభ్రపరచడం వల్ల చిగుళ్ల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది.నోటి దుర్వాసన మాయం.. గార, బ్యాక్టీరియా పోవడం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన సమస్య దూరమవుతుంది. అందమైన చిరునవ్వు..పళ్లపై పేరుకుపోయిన పసుపు రంగు మరకలు, మురికి పోయి దంతాలు తెల్లగా, అందంగా కనిపిస్తాయి. దృఢమైన దంతాలు.. పళ్లు, చిగుళ్లు దీర్ఘకాలం పాటు దృఢంగా, ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఓరల్ హెల్త్.. మొత్తంగా నోటి ఆరోగ్యం మెరుగుపడి, పళ్లు పుచ్చిపోయే ప్రమాదం తప్పుతుంది.

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.