చర్మ వ్యాధులకు ప్రధాన కారణాలు..?  

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో కొన్ని రకాల పోషకాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఐతే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, వైద్యులు తరచుగా సప్లిమెంట్లను తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. శరీరంలో విటమిన్లు లేకపోవడం వల్ల, అనేక వ్యాధుల బారిన పడటమే కాకుండా, చర్మం కూడా చాలా ప్రభావితమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చర్మంలో పొడిబారడం, నీరసం, చికాకు, దురద వంటి సమస్యలు మొదలవుతాయి. ఏయే విటమిన్ల లోపం కారణంగా చర్మం దెబ్బతింటుందో తెలుసా..?

విటమిన్ "డి".. 

విటమిన్ "డి" చర్మానికి చాలా ముఖ్యమైన విటమిన్. చర్మ రోగ నిరోధక శక్తిని కాపాడుకోవడంలో ఇవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరంలో దీని లోపం ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కలిగించే అవకాశం ఉంది. 

విటమిన్ "ఈ".. 

చర్మం పొడిబారడానికి విటమిన్ "ఈ" లోపం కూడా ఒక కారణమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. "ఈ" విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

విటమిన్ "బి".. 

శరీరంలో విటమిన్ "బి" లోపం వల్ల మొటిమలు, చర్మంపై దద్దుర్లు , ముడతలు వస్తాయి. విటమిన్ "బి" లోపం కారణంగా చర్మం సూర్య కిరణాలకు మరింత సున్నితంగా మారుతుంది. దీని వల్ల చర్మం కాస్త నల్లబడుతుంది. విటమిన్ "బి"లో మంట/వాపులను తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఫలితంగా అనేక చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

విటమిన్ "సి".. 

విటమిన్ "సి" శరీరానికి ఎంత మేలు చేస్తుందో, చర్మానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇది చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ మూలం, ఇది చర్మం విషపూరిత పదార్థాలతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ "సి " చర్మ సంరక్షణ విషయంలో కీలక పాత్రపోషిస్తుంది.

విటమిన్ "ఏ".. 

దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడంలో విటమిన్ "ఏ " ఎంతో బాగా  ఉపయోగపడుతుంది. శరీరంలో దీని లోపం వల్ల ఎగ్జిమా వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది కొత్త చర్మ కణాలను సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 


 

Tags : skin-disease
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com