వయసు పెరిగే కొద్దీ గుండె జబ్బుల ముప్పుపెరుగుతుందా..? ఎందుకు..?

షేర్ చేయండి:
వయసు పెరిగే కొద్దీ గుండె జబ్బుల ముప్పుపెరుగుతుందా..? ఎందుకు..?

సాక్షి లైఫ్ : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..? ధూమపానం చేయకూడదు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, వయస్సుకు సరిపడా బరువు ఉండాలి. శారీరక శ్రమ చేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 

గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ, వృద్ధులు కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం ద్వారా వారి రక్తపోటు, కొలెస్ట్రాల్ , రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. వృద్ధులు రోజుకు10 వేల అడుగులు నడవాలని సిఫార్సు చేస్తున్నారు పరిశోధకులు.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతి సంవత్సరం 6లక్షల 97వేల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. ప్రతి ఐదు మరణాలలో ఒకరు గుండె జబ్బుల కారణంగానే చనిపోతున్నారు.

ప్రధాన ప్రమాద కారకం.. 

గుండె జబ్బులకు వయస్సు ఒక ప్రధాన ప్రమాద కారకం అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ (ఎన్ఐఏ), 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు హార్ట్ అటాక్ , హార్ట్ స్ట్రోక్,  హార్ట్ ఫెయిల్యూర్ తో సహా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం వృద్ధాప్యం. దీని కారణంగా, గుండె రక్త నాళాలలో మార్పులు సంభవిస్తాయి.

 రక్త నాళాలు.. 

"వృద్ధులకు గుండె రక్త నాళాలు బిగుసుకుపోవడం ఎక్కువ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల అవయవాలకు రక్త ప్రవాహం తగ్గుతుందని, అంతేకాకుండా అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచడంతోపాటు ఇది గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. 

గుండె రక్తాన్ని పంప్ చేయడానికి.. 

గుండె రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడాలి. అదే సమయంలో గుండె కండరాలు బలహీనంగా మారవచ్చు లేదా దెబ్బతినవచ్చు, ఈ పరిస్థితి గుండె వైఫల్యానికి దారితీస్తుంది.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.