సాక్షి లైఫ్ : హై బ్లడ్ ప్రెషర్.. దీనినే హైపర్టెన్షన్ అనికూడా అంటారు. ఈ సమస్య వచ్చిందంటే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధిత రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఏం చేస్తే అటువంటి సమస్య నుంచి బయట పడొచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం..
-వంటల తయారీలో నూనెలు, కొవ్వు పదార్థాల వినియోగం తగ్గించాలి.
మసాలాలు, కారం వాడకాన్ని అదుపులో పెట్టుకోవాలి.
-ఉప్ప వినియోగం చాలా తగ్గించాలి.
-పొగతాగడం, మద్యం తాగడం మానుకోవాలి.
- ప్రతిరోజూ 40నిమిషాలపాటు వ్యాయామం చేయాలి.
- అంతేకాదు నిల్వ పచ్చళ్లు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి.
- వేపుడ్లు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, పిజ్జా వంటి ట్రాన్స్ క్రొవ్వు పదార్థాలను పూర్తిగా మానెయ్యాలి.
-శరీర బరువును తగ్గించుకోవాలి. శరీరానికి ఒత్తిడి, తోపాటు అనవసరంగా ఆందోళన చెందకుండా ఉండాలి.
-పలురకాల అలవాట్లను మార్చుకోవడం ద్వారా హైపర్టెన్షన్ను సమస్యను నియంత్రించవచ్చు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com