Vision : ఐ విజన్ బాగున్నా.. పరీక్షలు తప్పనిసరి..! ఎందుకంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చాలామంది దృష్టి స్పష్టంగా ఉంటే కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లేనని భావిస్తుంటారు. కంటిలో ఎలాంటి నొప్పి, మసకబారడం వంటి ఇబ్బందులు లేనంత వరకు వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటారు. అయితే, కంటికి సంబంధించిన అనేక తీవ్రమైన వ్యాధులు ఎలాంటి ముందస్తు సంకేతాలు, నొప్పులు లేకుండా నిశ్శబ్దంగా దాడి చేస్తాయని నేత్ర వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ దృష్టి బాగున్నప్పటికీ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

ప్రారంభ దశలో లక్షణాలు బయటపడకుండా చూపును హరించే ప్రధాన సమస్యలు..

నిశ్శబ్దంగా ముంచెత్తే గ్లకోమా..

గ్లకోమా (glaucoma) సమస్యలో కంటి నుంచి మెదడుకు దృశ్య సంకేతాలను చేరవేసే ‘ఆప్టిక్ నరం’ క్రమంగా దెబ్బతింటుంది. దీని తీవ్రత పెరిగే కొద్దీ కంటి చూపు పరిధి తగ్గిపోతుంది. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఈ సమస్య మొదలైనప్పుడు ఎటువంటి నొప్పి లేదా అసౌకర్యం ఉండదు. పరిస్థితి విషమించి శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడే వరకు రోగికి ఈ సమస్య ఉన్నట్లే తెలియదు. కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా ఉన్నా, రక్తపోటు లేదా మధుమేహం ఉన్నా ఈ ముప్పు మరింత ఎక్కువ.

మధుమేహులకు ‘డయాబెటిక్ రెటినోపతి’ ముప్పు..

రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలం పాటు అదుపులో లేకపోతే కంటి వెనుక భాగంలో ఉండే రెటీనా రక్తనాళాలు దెబ్బతింటాయి. దీన్నే ‘డయాబెటిక్ రెటినోపతి’ అంటారు. ప్రారంభంలో చూపు యథావిధిగానే ఉన్నప్పటికీ, లోపల సూక్ష్మ రక్తనాళాల్లో మార్పులు మొదలవుతాయి. అందుకే మధుమేహ బాధితులు కంటిచూపు బాగున్నప్పటికీ ఏడాదికి కనీసం ఒకసారైనా ‘డైలేటెడ్ ఐ ఎగ్జామినేషన్’ అంటే కనుపాపను వెడల్పు చేసి లోపలి భాగాన్ని పరిశీలించే పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

పరీక్షల్లో ఏం గుర్తిస్తారు..?

సాధారణ కంటి అద్దాల పరీక్షకు, సమగ్ర నేత్ర పరీక్షకు చాలా తేడా ఉంటుంది. పూర్తిస్థాయి పరీక్షలో భాగంగా వైద్యులు. కంటి లోపలి పీడనాన్ని (Measure intraocular pressure) కొలుస్తారు. ఆప్టిక్ నరం ఆరోగ్యాన్ని పరిశీలిస్తారు. రెటీనా రక్తనాళాల పనితీరును అంచనా వేస్తారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. చూపు ఆకస్మికంగా మసకబారడం, కంటిలో తీవ్రమైన నొప్పి లేదా ఎరుపుదనం రావడం,వెలుతురును చూసినప్పుడు కాంతి వలయాలు కనిపించడం, తలనొప్పితో పాటు చూపులో మార్పులు రావడం.


వీటిని కేవలం అలసటగా భావించి ఉపేక్షించకూడదు. కంటిచూపు స్పష్టంగా ఉండటం వేరు, కంటి అంతర్గత నిర్మాణం ఆరోగ్యంగా ఉండటం వేరు. నలభై ఏళ్లు దాటిన వారు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా నేత్ర వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడమే కంటి ఆరోగ్యానికి శ్రీరామరక్ష.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.