Dehydration : మూత్రం దుర్వాసనకు డీహైడ్రేషన్‌ కు లింక్ ఏంటి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రోజంతా సరిపడా నీరు తాగనప్పుడు మూత్రం సాధారణం కంటే కాస్త ఘాటుగా వాసన రావడం చాలామంది గమనిస్తుంటారు. ఇలా జరిగినప్పుడల్లా శరీరంలో నీటి శాతం తగ్గిందని (dehydration) భావిస్తుంటారు. అయితే, మూత్రం వాసనలో మార్పునకు డీహైడ్రేషన్‌ మాత్రమే కారణం కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనం తీసుకునే ఆహారం, విటమిన్‌ సప్లిమెంట్లు, మందులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI), ఇతర అంతర్గత ఆరోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చని చెబుతున్నారు.

 ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

డీహైడ్రేషన్‌ వల్లే ఇలా జరుగుతుందా..?

 ‘‘డీహైడ్రేషన్‌ అనేది అత్యంత సాధారణ కారణమే అయినప్పటికీ, అది ఒక్కటే కారణం కాదు. మూత్రం వాసన అనేది ఒక సంకేతం మాత్రమే, వ్యాధి నిర్ధారణ కాదు. మూత్రం రంగు, ఇతర లక్షణాలను బట్టి అసలు సమస్యను గుర్తించవచ్చు’’ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా మూత్రంలో నీటితో పాటు యూరియా, లవణాలు వంటి వ్యర్థాలు ఉంటాయి. నీరు తక్కువగా తాగినప్పుడు కిడ్నీలు శరీరంలోని ద్రవాలను నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఫలితంగా మూత్రం చిక్కబడి, ముదురు పసుపు రంగులోకి మారుతుంది. దీనివల్ల అమ్మోనియా వంటి ఘాటు వాసన వస్తుంది. లేత పసుపు రంగులో మూత్రం రావడం శరీరంలో తగినంత నీరు ఉందనడానికి సంకేతం.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.