కృత్రిమ తీపితో ప్రాణాంతక వ్యాధులు?

షేర్ చేయండి:
కృత్రిమ తీపితో ప్రాణాంతక వ్యాధులు?

సాక్షి లైఫ్:సహజసిద్ధమైన ఆహారాలు చాలావరకూ మనకు క్షేమమే కానీ కృత్రిమమైన వాటితో ప్రమాదం చాలా ఎక్కువ. తీపినిచ్చే చక్కెర కూడా దీనికి మినహాయింపేమీ కాదు.  వీటిని తినడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడే అవకాశాలు పెరుగుతున్నట్లు  పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆర్టిఫిషియల్‌ షుగర్‌తో.. 
 
ఊబకాయం అనేది ప్రపంచం మొత్తమ్మీద చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు అందరూ చెరో దారి పడుతూంటారు. చక్కెరల కారణంగా బరువు పెరుగుతున్నాం కాబట్టి వాటిని తగ్గించుకోవాలన్న భావనతో ప్రత్యామ్నాయంగా కృత్రిమ తీపిని ఉపయోగిస్తున్నారు. అయితే అయితే ఈ ఆర్టిఫిషియల్‌ షుగర్‌తో మంచి కంటే చెడే ఎక్కువ ఉన్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

ఆహార పదార్థాల్లో వినియోగించే ఆస్పర్టేమ్‌, శాకరైన్‌, సుక్రలోజ్‌, నియోటేమ్‌ వంటి కృత్రిమ చక్కెరల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. సహజ చక్కెర బదులు కృత్రిమ చక్కెర వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం 13 శాతం పెరుగుతుందని వెల్లడైంది. 

 మెడికల్‌ రిసెర్చ్‌.. 

పారిస్‌లోని ఫ్రెంచ్‌ నేషనల్‌ ఇన్‌ఫెక్షన్‌ హెల్త్‌, మెడికల్‌ రిసెర్చ్‌, సార్బొన్నె పారిస్‌ నోర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో  కృత్రిమ తీపి కారణంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌, ఊబకాయానికి సంబంధించిన క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉందని స్పష్టమైంది.

అధిక మోతాదులో..  

ఫ్రాన్స్‌లో 1,02,865 మందిపై ఈ అధ్యయనం జరిపారు. వీరందరి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య వివరాలను సేకరించారు. ఆ తర్వాత క్యాన్సర్ సంబంధిత పరీక్షలు జరిగాయి. అధిక మోతాదులో కృత్రిమ చక్కెరలు ముఖ్యంగా ఆస్పర్మ్‌, ఎస్‌సల్ఫేమ్‌-కె తీసుకున్న వారిలో ఎక్కువ శాతం క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. 

కృత్రిమ చక్కెరలు.. 

సాధారణంగా కృత్రిమ చక్కెరలు సాధారణ చక్కెరతో ఉంటాయి తక్కువ క్యాలరీలను, ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది. తయారీదారులు అందుకే వీటిని చాలా ఆహార పదార్థాల్లో వినియోగిస్తారు. శుక్రలోజ్‌ అనే కృత్రిమ చక్కెర సాధారణ చక్కెరతో తాజా 600 రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది. 

సాఫ్ట్‌ డ్రింక్‌లు.. 

సాఫ్ట్‌ డ్రింక్‌లు, బేకరీ పదార్థాలు, క్యాండీలు, చాక్లెట్లు, జామ్‌లు, జెల్లీలు, పొడితో తయారుచేసిన ద్రవాల్లో ఈ చక్కెరలు వాడతారు. ఎక్కువగా మధుమేహంతో బాధపడే వారు ఈ రకమైన చక్కెరలను ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజ నాలకంటే అనర్థాలే ఎక్కువని సైంటిస్టులు చెబుతున్నారు.

 ప్రకృతిలో మనకు సహజ సిద్ధంగా లభించేవి సరే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి కృత్రిమ ఉత్పత్తుల కంటే న్యాచురల్ గా లభించే ఉత్పత్తులతో ఎప్పుడైనా డేంజర్ అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..డయాబెటిస్ అంత ప్రమాదకరమా..? ఎంత వరకు నిజం..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.