గట్ బాక్టీరియా ఆరోగ్య ప్రయోజనాలు..?

షేర్ చేయండి:
 గట్ బాక్టీరియా ఆరోగ్య ప్రయోజనాలు..?

సాక్షి లైఫ్ : శరీరానికి ఆరోగ్యకరమైన గట్ హెల్త్ చాలా అవసరమని, అందుకోసం కోసం ప్రత్యేక పద్ధతులను అనుసరించాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. గట్ హెల్త్..అనేది జీర్ణక్రియను పెంపొందిస్తుంది. మన జీర్ణ వ్యవస్థలో కోటానుకోట్ల సూక్ష్మజీవులుంటాయి. వీటిల్లో కొన్ని చెడు చేసేవైతే.. మరికొన్ని మంచి చేసేవి. ఈ రెండింటి మధ్య సమతౌల్యత ఉన్నప్పుడే మన ఆరోగ్యం బాగుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్నే మనం గట్‌ హెల్త్‌ అని పిలుస్తాము. జీర్ణ వ్యవస్థలోని సూక్ష్మజీవుల ఆవరణాన్నే మైక్రో బయోటా అని కూడా ఉంటారు. 

మైక్రోబయోమ్.. 

జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు రోగ నిరోధక శక్తి , గుండె , మెదడు ఆరోగ్యానికీ తోడ్పడతాయి. మనిషి శరీరంలో లక్షల కోట్ల బ్యాక్టీరియాలు, వైరస్‌, శిలీంధ్రాలు ఉంటాయి. ఇవన్నిటినీ కలిపి "మైక్రో బయోమ్" అంటారు. 

 300 నుంచి 500 రకాల బ్యాక్టీరియాలు.. 

 గట్ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో నివసించే బ్యాక్టీరియా.  మన గట్‌లో దాదాపు 300 నుంచి 500 రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అవి దాదాపు రెండు మిలియన్ జన్యువులను కలిగి ఉంటాయి.  ఒక్కోక్కరి జీర్ణవ్యవస్థలో ఉండే మైక్రో బయోటా వారికే సొంతం. ఒక రకంగా మనకు వేలిముద్రల మాదిరిగా ప్రత్యేకమన్నమాట. మన జీవనశైలి, తీసుకునే ఆహారం రెండూ  మైక్రో బయోటాను ప్రభావితం చేస్తూంటాయి.  

గట్ హెల్త్ బాగుంటే....

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
శరీరంలోకి హానికరమైన బ్యాక్టీరియా చేరకుండా చేస్తుంది.
కిణ్వ ప్రక్రియ ద్వారా జీర్ణం కావడం కష్టతరమైన ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
ప్రేగులలో విటమిన్ "కె ", బయోటిన్, ఫోలేట్ సంశ్లేషణ
ఇది అమ్మోనియా వంటి హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది.
ఐరన్, మెగ్నీషియం, కాల్షియం మొదలైన అనేక పోషకాలను గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మన శరీరంలో చెడు గట్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఆ బాక్టీరియా ప్రేగులకు మొత్తం శరీరానికి హానికరం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో గట్ హెల్త్ దెబ్బతింటుంది. యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల కూడా దీనిపై ప్రభావం పడుతుందట. 

ఒత్తిడి, అనారోగ్య జీవనశైలి, ధూమపానం, మద్యపానం మొదలైన అలవాట్లకారణంగా గట్ హెల్త్ క్షీణిస్తుంది. గట్ బ్యాక్టీరియా హానికరం అయితే అల్సరేటివ్ డిజార్డర్, క్రోన్'స్ వ్యాధి, అనేక గుండె జబ్బులు, కీళ్లనొప్పులు, పెద్దప్రేగు క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం మొదలైన అనేక వ్యాధులకు దారితీస్తుంది. ఇది డిప్రెషన్, ఆటిజం, యాంగ్జయిటీ మొదలైన మానసిక రుగ్మతలను కూడా కలిగిస్తుంది.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.