శీతాకాలంలోనూ హాయిగా.. హుషారుగా ఉండాలంటే...!

షేర్ చేయండి:
శీతాకాలంలోనూ హాయిగా.. హుషారుగా ఉండాలంటే...!

సాక్షి లైఫ్ : సీజన్ ను బట్టి ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల కొన్నిరకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకోసం ముఖ్యంగా వింటర్ సీజన్‌లో మనం ఏమి తినాలి..? తినకూడదో..తెలుసుకోవాలి. తద్వారా సీజన్ మారే సమయంలో కూడా ఇన్ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉండవచ్చు.

ప్రకృతి నియమాలకు కట్టుబడి.. 

 శీతాకాలం, వేసవి, వర్షం ప్రకృతి నియమాలకు కట్టుబడి ఉండే వాటి సొంత చక్రాన్ని కలిగి ఉంటాయి. ఈ సీజన్లలో వచ్చే మార్పులు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే..? ఈ మార్పుల వల్ల అంటువ్యాధులు పెరుగుతాయి. వాతావరణంలో మార్పుల సమయంలో జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్, అలర్జీ వంటి సమస్యలు తలెత్తుత్తాయి.
 
ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే..? 

ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే..?  చలికాలంలో మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతోపాటు రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ సమయంలో ఏమి తినాలి..? ఏమి తినకూడదు అనే విషయాలు తెలిస్తే. తద్వారా సీజన్ మారినా హెల్తీగా ఉండొచ్చు. 

సీజన్ మారుతున్న సమయంలో.. 

సీజన్ మారుతున్న సమయంలో తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకేరకమైన ఫుడ్ కాకుండా అన్నిరకాల ఫుడ్ తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఏ సీజన్ లో వచ్చే పండ్లు , కూరగాయలు ఆ సీజన్ లో తప్పనిసరిగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 
 
జీర్ణవ్యవస్థపై.. 

కొన్ని రకాల బ్యాక్టీరియా ఆహారంలో పెరుగుతుంది. ఇది మన జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువరోజులు నిల్వా ఉన్న ఆహారాన్ని లేదా ఎక్కువ రోజులు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ఫుడ్ తినకూడదు.

సులభంగా జీర్ణమయ్యే ఆహారం తినాలి..

సీజనల్ గా వచ్చే మార్పుల సమయంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రెడ్ మీట్ లేదా పిండితో చేసిన ఆహారపదార్థాలు జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో అంటువ్యాధులు వచ్చే ప్రమదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, సులభంగా జీర్ణమయ్యే ఆహారం జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడిని కలిగించదు. త్వరగా శరీరానికి అవసరమైన పోషణను అందిస్తుంది.

పండ్లు, కూరగాయలలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకోసమే కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయల స్వభావం కూడా శరీరానికి సీజన్‌కు అనుగుణంగా వ్యాధులతో పోరాడటానికి తగినంత శక్తిని ఇస్తాయి.


వేపుళ్లు

మిరపకాయలు, మసాలా దినుసులతో చేసిన వంటకాలు కొన్నిసార్లు మన ఆహార రుచిని పెంచుతాయి, కానీ అవి కొన్నిసార్లు  డీహైడ్రేషన్ కి కారణమవుతుంది. వీటిలో అదనపు కేలరీలు, కొవ్వులు ఉంటాయి, ఇవి శరీరానికి హానికరం.

  రోగనిరోధక శక్తిని పెంచడంలో.. 

ఇంట్లో తయారుచేసిన ఆహారం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
అల్లం, పసుపు, తేనె, పాలు వంటివి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో, వ్యాధులతో పోరాడడంలో ఇవి  చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 


 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.