Amazing Health Benefits of Figs : అంజూర పండ్లతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!
సాక్షి లైఫ్ : అంజూర పండ్లు (Figs) రుచికి తీయగా ఉండటమే కాదు, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని పచ్చిగా లేదా ఎండువిగా ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ 'ఎ', 'సి', 'కె' లకు అంజూరం కేరాఫ్ అడ్రస్. తల నుంచి పాదాల వరకు శరీరంలోని అనేక అవయవాల పనితీరును మెరుగుపరచడంలో ఈ 'సూపర్ఫ్రూట్' ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
అంజూర తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
అంజూరంలో విటమిన్ 'ఎ', యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ అంజూరం తినడం వల్ల కంటి అలసట తగ్గడంతో పాటు, వయసు పైబడటం వల్ల వచ్చే దృష్టి సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో..
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అంజూరం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్, పొటాషియం రక్తపోటు (bp), కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
జీర్ణ సమస్యలకు..
మలబద్ధకం, అజీర్తి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో తరచుగా బాధపడేవారికి అంజూరం ఒక దివ్యౌషధం. ఇందులోని పీచు పదార్థం (fiber) పేగులను శుభ్రపరిచి, జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది.
ఎముకలు, కీళ్లకు బలం..
వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం సహజం. అంజూరంలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎముకలకు అవసరమైన ధృఢత్వాన్నిస్తాయి. ముఖ్యంగా 'ఆస్టియోపోరోసిస్' వంటి ఎముకల వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.
బరువు, బ్లడ్ షుగర్ నియంత్రణ..
ఎండు అంజూరాల్లో ఉండే సహజసిద్ధమైన తీపి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. తగిన మోతాదులో తీసుకుంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే, ఇందులోని ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా అతిగా తినడాన్ని తగ్గించి బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు.
మెరిసే చర్మం, దృఢమైన కురులు..
విటమిన్ 'సి', యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతాయి. ముఖంపై ముడతలు రాకుండా, వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరనివ్వవు. అంతేకాకుండా జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, కేశాల ఎదుగుదలకు తోడ్పడతాయి.
ఆహారంలో ఎలా చేర్చుకోవాలి..?
అంజూరాన్ని మన రోజువారీ డైట్లో చేర్చుకోవడం చాలా సులువు.
ఉదయం తీసుకునే అల్పాహారంతో పాటు తినవచ్చు.
ఆరోగ్యకరమైన సలాడ్స్లో ముక్కలుగా కోసి కలుపుకోవచ్చు.
స్మూతీలు, మిల్క్ షేక్స్ తయారీలో వాడుకోవచ్చు.
మీకు ఇష్టమైన స్వీట్స్, డెజర్ట్స్లో పంచదారకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
