యువతలో పెరుగుతున్న హార్ట్ ప్రాబ్లమ్స్ కు ప్రధాన కారణాలు..?
సాక్షి లైఫ్: ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న అనారోగ్య సమస్యలకు మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలకు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమవుతోందని కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. గుండె సమస్యలను నివారించేందుకు శారీరక శ్రమ తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు. కిలోమీటరు దూరాన్ని ఎనిమిది - పది నిమిషాల్లో పూర్తి చేయగలిగేంత వేగంతో నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు.
తగిన శారీరక శ్రమ..
యువతలో తగిన శారీరక శ్రమ లేకపోవడమే గుండె జబ్బులకు ప్రధాన కారణమని డాక్టర్లు అంటున్నారు. వ్యాయామం లేమికి పెరిగిపోతున్న మానసిక ఒత్తిళ్లు కూడా తోడు కావడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గోపీచంద్ మన్నం చెబుతున్నారు.
నివారణకు ఏం చేయాలి..?
గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలతోపాటు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏమిటి..? ఎలాంటివారికి అవసరం..? అనే అంశాల గురించి డాక్టర్ గోపీచంద్ మన్నం సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
